Powerstar: ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కు జోడీగా నిత్యామీన‌న్ అంటా..

Powerstar: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి ప్ర‌ధాన పాత్ర‌ల్లో అయ్య‌ప్ప‌నుమ్ కోషియ‌మ్ రీమేక్ చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి సాగ‌ర్ కె చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో.. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ఈ చిత్రానికి స్ర్కీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. కాగా ఇప్ప‌టికే రానాకు జోడీగా ఐశ్వ‌ర్య రాజేశ్ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. Powerstar ప‌వ‌న్ స‌ర‌స‌న భార్య‌గా న‌టించేదేవ‌రు అని ఊహాగానాలు ప్రేక్ష‌కుల్లో మొద‌ల‌య్యాయి.

Ak remake

మొద‌ట సాయిప‌ల్ల‌విని తీసుకుంటున్న‌ట్లు వార్తాలు వెలువ‌డ్డాయి. తాజాగా మ‌రో హీరోయిన్ పేరు వినిపిస్తోంది. ప్ర‌ముఖ న‌టి నిత్యామీన‌న్ ఈ చిత్రంలో Powerstar ప‌వ‌న్ స‌ర‌స‌న న‌టిస్తుంద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం ఆమెతో సంప్ర‌దింపులు జ‌రుగుతున్నాయ‌ట‌. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా.. ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ ఈ చిత్రానికి స్వ‌రాలు అందిస్తున్నారు.