మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి నటిస్తున్న RRRలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత రాంచరణ్ చేసే సినిమాపై క్లారిటీ వచ్చేసింది. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో రాంచరణ్ తన తర్వాతి సినిమా చేయనున్నాడు. దీనిపై ఇవాళ అధికారికంగా ప్రకటన వచ్చేసింది. రాంచరణ్‌తో తన తర్వాతి సినిమా చేయనుండటం చాలా ఎగ్జైటింగ్‌గా ఉందంటూ శంకర్ ట్వీట్ చేశారు.
ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించనున్నట్లు శంకర్ ట్విట్టర్‌లో ప్రకటించారు. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాగా దీనిని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కమల్‌హాసన్‌తో ఇండియన్ 2 సినిమాను శంకర్ తెరకెక్కిస్తున్నాడు. ఇది పూర్తైన తర్వాత రాంచరణ్ సినిమా ప్రారంభం కానుంది.