అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా దగ్గుబాటి వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ ముఖ్య పాత్రలో నటిస్తూ సంక్రాంతి సందర్భంగా జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. సాయికుమార్, రాజేంద్ర ప్రసాద్, ఉపేంద్ర, వి కె నరేష్, వీటికె గణేష్ తదితరులు కీలకపాత్రలో నటించిన ఈ చిత్రంలోని గోదారి గట్టు పాట ఇప్పటికే మంచి సంచలనం సృష్టిస్తూ నిలిచింది. అయితే సంగీత దర్శకుడు రమణ గోగుల ఈ పాటకు తన స్వరాన్ని అందించి పాడడం జరిగింది. సుమారు 10 సంవత్సరాల తర్వాత రమణ గోగుల మరోసారి సినీ ఇండస్ట్రీలోకి కాలు పెట్టి కమ్ బ్యాక్ ఇచ్చినట్లు చెప్పుకోవచ్చు.
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా గోదారి గట్టు సాంగ్ పాడిన రమణ గోగుల మాటల్లో….
- నాకు ఈ పాట ఇంత మంచి హిట్ కావడం చాల సంతోషంగా ఉంది. ఇంత కాలం తరవాత మరోసారి పాడటం, ఆ పాట నా అభిమానులకు కూడా బాగ నచడం చాల నచ్చింది.
- వెంకటేష్ కోసం మరోసారి ఈ పాట పాడటం చాల ఆనందాన్ని ఇచ్చింది. ఈ పాటలో ఒక మంచి సోల్ ఉంది.
- మొదటిసారి వేరే వారి సంగీత దర్శకత్వంలో నేను ఇలా పాడటం. ఇండస్ట్రీకు కొత్త రకమైన సంగీతం రావాలి.
- మంచి సినిమా కోసం నేను ఎదురుచూస్తున్నాను. నేను కచ్చితంగా కమ్ బ్యాక్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నాను.
- యుఎస్ఏలో కన్సర్ట్ లు జరుగుతాయి. కచ్చితంగా ఒక మంచి ఊపు ఊపేల ఎలా ఏమైనా చేయాలి.
- ఈ గ్యాప్ రావడానికి కారణం నేను అమెరికాలో ఒక పెద్ద కంపెనీతో వర్క్ చేయడం. నాకు సంగీతం కావాలి, అలాగే బిజినెస్ కూడా కావాలి.
- నాకు భీమ్స్ ఈ పాటకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. అందుకే ఈ పాట చాల బాగ వచ్చింది.
- పవన్ కళ్యాణ్ ఒక క్రియేటివ్ పర్సన్, మంచి స్నేహితుడు, కొత్త విషయాలు నేర్చుకునే ఆసక్తి ఉండే వ్యక్తి. ఇప్పుడు ఆయన రాజకీయాల్లో గేమ్ చేంజర్.
- ఇప్పుడు ఈ పాట చాల వైరల్ అయింది. అనిల్ తో పని చాయం నాకు చాల కంఫర్ట్ అనిపించింది. పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు.
- నా మొదటి పాట వెంకటేష్ తోనే, ఇప్పుడు కమ్ బ్యాక్ కూడా వెంకటేష్ తోనే. ఇది మరో విశేషం.
- నేను పాట పాడాలి అంటే పాటలో ప్రాణం ఉండాలి, మంచి అర్థం ఉండాలి. నటులు, దర్శకులు నచ్చాలి.
- ఈ పాట విన్నాక వెంకటేష్ ఫోన్ చేసి నచ్చింది అని చెప్పారు.
- నేను కమ్ బ్యాక్ ఇవ్వగానే చాల మంది నన్ను ఇండస్ట్రీ నుండి రీచ్ అయ్యారు. నాకు ఇష్టం అయితేనే పాట పాడతను. నేను ఎక్కడ ఎప్పుడు కంగారు పడ్డాను.
- ఇప్పటికీ కూడా నేను నా సంగీతాన్ని వదలలేదు.
- వచ్చే సంవత్సరం ఒక కన్సర్ట్ ప్లాన్ చేస్తున్నాను. నాకు డ్యాన్స్ చేసేలా అవసరం లేదు. సింపుల్ గా పాడటం నాకు చాల ఇష్టం.
- రీమిక్స్ విషయంలో ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఓకె.
- నా సాంగ్ ఒకటి రీమిక్స్ చేయడం నాకు చాల సంతోషకరం. కాపీరైట్ వేసే ఉద్దేశం నాకు లేదు.
- నేను రెండు పనులు బ్యాలెన్స్ చేస్తాను. సంగీతం అలాగే నా ప్రొఫెషన్.
- ఈ సినిమా నుండి నేను పాడింది ఈ ఒక్క పాట మాత్రమే ఉంది.
- తమ్ముడు సినిమాలో నేను అన్ని పాటలు పాడటానికి పవన్ కళ్యాణ్ కారణం.
- నేను ఒక పాట పాడటానికి సుమారు 2-3 వారాలు సమయం పడుతుంది.
- భాస్కర్బట్ల మంచి పాట రాయడం జరిగింది. ప్రతి పదం అద్భుతంగా ఉంది.