Charan: సీపీ సజ్జనార్ సమక్షంలో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 3వ వార్షికోత్సవం ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా మెగా పవర్‌స్టార్ రాంచరణ్ హాజరయ్యారు. అలాగే ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపూరి కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. సైబరాబాద్ పోలీసు కమీషనరేట్ ఆవరణలో ఈ ముగింపు వేడుకలు విజయవంతంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రామ్‌చరణ్ మాట్లాడుతూ.. జీవితంలో గెలుపోటములు సహజం అని Charan చరణ్ అన్నారు.
తప్పకుండా క్రీడల్లో పాల్గొనాలని, నాకు పోలీసు కథలు అంటే చాలా ఇష్టం.. నా సినిమాలో ధృవ, తుపాకీ, ఇప్పుడు తాజా చిత్రంలో ఆర్ఆర్ఆర్లో పోలీసు పాత్రలు చేశాను. ఇక కరోనా సమయంలో ఇద్దరు మాత్రమే ఎక్కువగా కష్టపడ్డారు. వారే పోలీస్ శాఖ, వైద్య శాఖ అని అన్నారు. ఆ సమయంలో వారి కుటుంబ సభ్యులను వదిలి ప్రజల శ్రేయస్సుకోసం ఎంతో కష్టపడ్డారని.. ఈ వేడుకల్లో ఒక ఫ్యామిలీలా పాల్గొని విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. అలాగే సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. క్రీడల్లో గెలిచిన వారికి బహుమతులు అందజేయడానికి వచ్చిన సినీ నటుడు Charan రాంచరణ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపూరి రమేష్‌లకు ధన్యవాదాలు తెలిపారు. రామ్ నటించిన మగధీర, ధృవ, రంగస్థలం సినిమాలు చూశానని, అందులో ధృవ చిత్రం తనకెంతో నచ్చిందని పేర్కొన్నారు. కానీ Charan చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో బిజీగా ఉన్నా అయినా.. ఈ కార్యక్రమానికి చరణ్‌ను పంపించినందుకు సినీ దిగ్గజ డైరెక్టర్ రాజమౌళి గారికి ధన్యవాదాలు తెలిపారు.