Prabhas: ప్ర‌భాస్ “ఆదిపురుష్” సెట్స్‌లో భారీ అగ్నిప్ర‌మాదం.. ఫ్యాన్స్ క‌ల‌వ‌రం..

Prabhas: బాహుబ‌లి ప్ర‌భాస్ తాజా చిత్ర‌మైన బాలీవుడ్ మూవీ ఆదిపురుష్‌. ఈ చిత్రంతో ప్ర‌భాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ రోజు మంగ‌ళ‌వారం ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టి.. ముంబైలోని గోరెగాన్ స్టూడియోలో షూటింగ్ జ‌రుపుతుండ‌గా సెట్స్‌లో ఒక్క‌సారిగా మంట‌లు చేల‌రేగాయి. దీంతో గ్రీన్ స్క్రీన్ క్రోమా సెట‌ప్ పూర్తిగా కాలిపోవ‌డంతో పాటు కొంత ఆస్తి న‌ష్టం వాటిల్లింద‌ని స‌మాచారం. కానీ ఎలాంటి ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌క‌పోవ‌డంతో యూనిట్ స‌భ్యులంద‌రూ ఊపిరిపీల్చుకున్నారు.

Adhipurush

అదేవిధంగా ఈ చిత్ర డైరెక్ట‌ర్ ఓం రౌత్ తో పాటు చిత్ర‌యూనిట్ అంతా సుర‌క్షితంగా ఉన్నారు. అయితే ఈ చిత్ర షూటింగ్‌లో సైఫ్ అలీఖాన్‌, Prabhas ప్ర‌భాస్ పాల్గొన‌లేదు.. ఇక దీనికి సంబంధించిన వార్తా ఇప్ప‌డు వైర‌ల్‌గా మారి..అభిమానులు కొంత నిరాశ‌కు గుర‌వ‌తున్నారు. ఆదిపురుష్ చిత్ర ప్రారంభోత్స‌వం రోజునే ఇలా జ‌ర‌గ‌డంతో.. అభిమానులు క‌ల‌వ‌రపాటు చెందుతుందన్నారు. ఇదిలా ఉంచితే.. Prabhas ప్ర‌భాస్ ప్ర‌స్తుతం కేజీఎఫ్ ఫేం తెరకెక్కిస్తున్న స‌లార్ చిత్రం షూటింగ్‌లో భాగంగా.. తెలంగాణ జిల్లాలోని రామ‌గుండంలోని సింగ‌రేణి బొగ్గు గ‌నిలో షూటింగ్ లో పాల్గొన్నారు.