ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో రామ హనుమాన్ క్యారెక్టర్ లు చేసేది వీళ్ళేనా

యంగ్ హీరో తేజ సజ్జా నటించిన కొత్త చిత్రం ‘హనుమాన్‌’. చిన్న సినిమాగా విడుదలై సూపర్‌ హిట్‌ టాక్​ను సొంతం చేసుకుంది. సినిమా విడుదలై 15 రోజుల్లో రూ.250కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. మరన్ని వసూళ్లు అందుకునే దిశగా ముందుకెళ్తోంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన విధానానికి అందరూ ఫిదా అయిపోతున్నారు.

దీంతో ఈ మూవీపై సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్​యూనివర్స్​లో భాగాంగా ఈ చిత్రానికి సీక్వెల్​కూడా రానుంది. అయితే ఈ సినిమా సక్సెస్​అయిన నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ తన సీక్వెల్స్​లో మెగాస్టార్ చిరంజీవిని, సూపర్ స్టార్ మహేశ్​బాబును తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. వివరాళ్లోకి వెళితే..

చిన్న సినిమాగా విడుదలై పాన్ ఇండియా రేంజ్​లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమా ‘హనుమాన్’. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో తేజ సజ్జ హీరోగా నటించారు. జనవరి 12వ తేదీన రిలీజ్ అయిన ఈ చిత్రం ఇప్పటికే దాదాపు రూ. 300 కోట్ల రూపాయలు కలెక్షన్లకు దగ్గర్లో ఉంది. అయితే హనుమాన్ మూవీ ఎండింగ్​లో సెకండ్ పార్ట్​కు లీడ్ ఇస్తూ ‘జై హనుమాన్’ సీక్వెల్​ను అనౌన్స్​చేశారు మేకర్స్​. ‘రాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏంటి?’ అనే క్వశ్చన్​తో మొదటి భాగాన్ని ముగించారు. ఇక ఆ ఎండింగ్​తో సెకండ్ పార్ట్​పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో పాటే సీక్వెల్​లో హనుమాన్ పాత్రను స్టార్ హీరో నటిస్తారని చెప్పారు ప్రశాంత్ వర్మ.

ఇక ఈ కామెంట్స్​తో హనుమాన్ పాత్రను ఎవరు పోషిస్తారో అన్న ఆసక్తి అందరిలో నెలకుంది. అలాగే రాముడిగా ఎవరు కనిపిస్తారనే క్యూరియాసిటీ కూడా ఎక్కువగా నెలకొంది. అయితే ఈ రెండు గొప్ప పాత్రల్లో ఎవరు నటిస్తారనే విషయమై తన మనసులోని మాటలను బయటపెట్టారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. మొదటి భాగం హనుమాన్​సినిమా బ్లాక్ బస్టర్ హిట్​గా నిలిచిన నేపథ్యంలో తాజాగా ప్రశాంత్ వర్మ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో హనుమంతుడి పాత్ర కోసం చిరంజీవి గారిని తీసుకునే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.

హనుమాన్​గా చిరంజీవి : ‘గ్రాఫిక్స్​లోనే చిరంజీవి గారి కళ్లు చూపించారు. మరి అవకాశం ఉందా’ అని యాంకర్ అడగగా.. “హనుమాన్​గా చిరంజీవి కనిపించే అవకాశం ఉంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన్ను మేము మళ్ళీ కలవలేదు. ఆయన పద్మవిభూషణ వచ్చి బిజీగా ఉన్నారు. పెద్దవాళ్లు వెళ్లి కలుస్తున్నారు. మేం తర్వాత వెళ్లి కలుస్తాను. తర్వాత క్లారిటీ వస్తుంది” అని ప్రశాంత్ వర్మ పేర్కొన్నారు.

రాముడిగా మహేశ్​బాబు : ఇక రాముడి పాత్ర గురించి ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. “రాముడి పాత్రను మహేశ్​బాబు చేస్తే బాగుంటుంది. నా మైండ్​లో ప్రస్తుతానికి అదే ఉంది. ఆల్రెడీ మా ఆఫీస్​లో మహేశ్​బాబును గ్రాఫిక్స్​లో రాముడిగా డిజైన్ చేసి చూసుకున్నాము. చూద్దాం తర్వాత ఏం జరుగుతుందో” అని చెప్పుకొచ్చారు.