కుమారి అంటీకి అండగా హీరో సుందీప్ కిషన్

కుమారి ఆంటీ, సోషల్ మీడియా ఇటీవల ఈ వీడియో పేరు బాగా ట్రెండ్ అవుతుంది. విషయానికొస్తే ఆమె ఒక స్వీట్ ఫుడ్ షాప్ నడుపుతుంది. ఇటీవలే ఆవిడ ఫేమస్ కావడం వలన, తన షాప్ కి వచ్చే రద్దీ పెరగడం వలన, ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని ట్రాఫిక్ పోలీసులు ఆవిడ షాప్ ని వెంటనే అక్కడి నుండి మార్చాలని సూచించారు. కానీ దానికి కుమారి ఆంటీ ఒప్పుకోలేదు.
హీరో సందీప్ కిషన్ తన ఎక్స్ ప్లాట్ఫామ్ వేదికగా కుమారి ఆంటీ కి తన సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఓ ఆడ వ్యక్తి తన స్వయంకృషితో స్వతంత్రంగా ఓ చిన్నపాటి బిజినెస్ సక్సెస్ఫుల్గా పనిచేయడం తనకు చాలా సంతోషాన్ని ఇస్తుందని, అటువంటి చిరు వ్యాపారులకు ఎప్పుడు మంచే జరగాలని అన్నారు.

ఇటీవలే ఊరు పేరు భైరవకోన సినిమా ప్రమోషన్స్ కోసం హీరో సందీప్ కిషన్, హీరోయిన్ వర్ష బొల్లమ్మ కుమారి ఆంటీ ఫుడ్ షాప్ ని సందర్శించిన విషయం అందరికీ తెలిసిందే.