రామ్ ‘రెడ్’ రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన రెడ్ అనే సినిమాలో రామ్ కథానాయకుడిగా కనిపించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి OTT ఆఫర్స్ చాలా వచ్చినప్పటికీ చిత్ర నిర్మాతలు ఆ డీలింగ్స్ అంగీకరించలేదు. మొత్తానికి, ఈ సినిమా థియేటర్స్ లోనే విడుదలకు సిద్ధమయ్యింది. అక్టోబర్ 15 న థియేటర్లు ఓపెన్ చేసిన తర్వాత రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

లాక్ డౌన్ తరువాత అంధరికంటే ముందుగా వచ్చే మొదటి చిత్రం ఇదేనని తెలుస్తోంది. ఇక రామ్ తన బృందంతో చర్చించి, రాబోయే రోజుల్లో విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే రామ్ స్పెషల్ గా ప్రమోషన్ల కోసం కూడా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. శ్రావంతి రవి కిషోర్ నిర్మించిన సినిమా తమిళ్ మూవీ తడమ్ సినిమా ఆధారంగా రూపొందింది. ఇక మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమాలో నివేత పేతురాజ్, మాళవిక శర్మ, అమృత అయ్యర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.