పలాసా 1978 దర్శకుడిని అభినందించిన అల్లు అర్జున్

హీరో అల్లు అర్జున్ విమర్శకుల ప్రశంసలు పొందిన పీరియడ్ డ్రామా పలాసా 1978 దర్శకుడిని ఆశ్చర్యపరిచారు. సోషల్ మీడియాలో ఒక స్పెషల్ ఫొటో కూడా పోస్ట్ చేశారు. పలాసా దర్శకుడు కరుణ కుమార్‌కు ఒక మొక్కను బహుమతిగా ఇచ్చి పాజిటివ్ కాంప్లిమెంట్స్ అందించారు. ఇలాంటి మంచి దర్శకులు, నటులు కొత్త యుగం తెలుగు చిత్రాలలో రావడం చాలా ఆనందంగా ఉందని బన్నీ అన్నారు.

“పలాసా 1978 యొక్క మొత్తం బృందానికి అభినందనలు. ఆ సినిమా చూసిన మరుసటి రోజు ఉదయం దర్శకుడిని కలిశాను. గొప్ప అంతర్లీన సందేశంతో అద్భుతమైన ప్రయత్నం. ఇందులో చాలా మంచి ముమేంట్స్ ఉన్నాయి. నేను వ్యక్తిగతంగా చాలా ఇష్టపడ్డాను, ”అని అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. ఇక అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ యొక్క ఆహా OTT ప్లాట్‌ఫామ్ కోసం కరుణ కుమార్ ఇటీవల మెట్రో కథలు అనే చిత్రాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. నెక్స్ట్ ఈ దర్శకుడు అల్లు అరవింద్ ప్రొడక్షన్ లోనే మరో సినిమా చేయబోతున్నాడు.