కొరటాల మరో నక్సల్ కథ.. ఆ కామ్రేడ్ ఎవరో?

టాలీవుడ్ లో అపజయాలు లేని దర్శకులతో కొరటాల శివ ఒకరు. సందేశాత్మక కథలలో కమర్షియల్ ఎలిమెంట్స్ ని జోడించగల కొరటాల ఫ్యూచర్ లో కూడా ఎక్కువగా అలాంటి కథలనే తెరపైకి తెస్తాడట. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా చేస్తున్న కొరటాల శివ ఆ తరువాత అల్లు అర్జున్ తో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో మరో సినిమా చేయనున్నాడు.

అందులో అల్లు అర్జున్ ఒక యువ పొలిటీషియన్ గా కనిపించబోతున్నాడు. ఇక కొరటాల వద్ద పదికి పైగా కథలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 5 పూర్తయ్యాయి. ఇక బన్నీ తరువాత చేయబోయే సినిమాలో పూర్తిగా నక్సలిజం బ్యాక్ డ్రాప్ లోనే మరో సినిమా చేయబున్నట్లు తెలుస్తోంది. ఆచార్య సినిమాలో మెగాస్టార్ సెకండ్ హాఫ్ లో నక్సలైట్ గా కనిపిస్తారని టాక్ వస్తున్న విషయం తెలిసిందే. కానీ అది ఒక ఎపిసోడ్ మాత్రమేనట. ఇక అల్లు అర్జున్ తో పొలిటికల్ సినిమా చేసిన తరువాత పూర్తిగా కామ్రేడ్ కాన్సెప్ట్ లో కథ ఉంటుందట. మరి ఆ కామ్రేడ్ కథలో ఎవరు నటిస్తారో చూడాలి.