బాలా ‘అర్జున్ రెడ్డి’ మొదట రీమేక్.. రిలీజ్ కి రెడీ!

విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్ నటించిన అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ కు మొదట దర్శకత్వం వహించింది బాలా. జాతీయ అవార్డు గ్రహీత బాలా ఎలాంటి దర్శకుడో అందరికీ తెలుసు. వర్మ పేరుతో, ఈ చిత్రం మొత్తం పూర్తయిన తర్వాత రిలీజ్ కు సిద్దమైన సమయంలో సినిమా ఏ మాత్రం బాగోలేదని విడుదలను ఆపేశారు. ఇక సందీప్ రెడ్డి వంగ సహాయ దర్శకుడు గిరీసాయ అదే కథను ఆదిత్య వర్మగా మళ్ళీ షూట్ చేసి విడుదల చేయగా బాక్సాఫీస్ హిట్ అందుకున్నాడు.

అయితే ఇప్పుడు, బాలా దర్శకత్వం వహించిన మొదటి వెర్షన్ ని OTT ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. వర్మ సినిమాను అక్టోబర్ 6న సింప్లీ సౌత్ అనే ఓటీటీ యాప్‌లో విడుదల చేయనున్నారు. బాలా సినిమాలను తమిళనాడు జనాలు ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. ఇక ఇప్పుడు ఓ వర్గం వారు అలాగే అర్జున్ రెడ్డి సినిమా అభిమానులు వర్మ సినిమాను చూడటానికి రెడీ అవుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఈజీగా అర్ధమవుతొంది. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.