రామ్ గోపాల్ వర్మ… ఈ పేరు వినగానే ఎన్నో విషయాలు మైండ్ లో తిరుగుతాయి. వాటన్నింటినీ పక్కన పెట్టి చూస్తే, వర్మ ఎప్పుడూ దేనికీ వెనక్కి తగ్గడు… చెప్పాలి అనుకున్నది ఎవరేమనుకున్నా చెప్పకుండా ఉండడు అనేది నిజం. ప్రతి విషయంలో ఇలానే ఉండే వర్మ, మొదటిసారి వెనక్కి తగ్గాడు… తన సినిమాకి టైటిల్ మార్చాడు. ఏపీ పాలిటిక్స్ అండ్ పొలిటీషియన్స్ ని టార్గెట్ చేస్తూ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా చేస్తున్న వర్మ, ఎన్ని వివాదాలు విమర్శలు ఎదురైనా రిలీజ్ వరకూ తీసుకొచ్చాడు.
కేఏ పాల్, కుల సంఘాలు వ్యతిరేకించినా రిలీజ్ కి రెడీ అయిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా సెన్సార్ కి వెళ్ళింది. సెన్సార్ బోర్డు వ్యతిరేకించడంతో వర్మ, చాలా సింపుల్ గా టైటిల్ మార్చేశాడు. ఒక సినిమా టైటిల్ ఇంత ఈజీగా మార్చేయొచ్చా అనే ఆశ్చర్యం కలిగించేలా చేసిన వర్మ, కమ్మ రాజ్యంలో కడప రెడ్లని… అమ్మ రాజ్యంలో కడప బిడ్డలుగా మార్చేశాడు. ఇంట ఫాస్ట్ గా డెసిషన్స్ తీసుకోవడం ఆయనకి మాత్రమే సాధ్యం అయ్యింది. అయితే టైటిల్ మారినా సెన్సార్ డిలే అవ్వడంతో కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనుకున్న సమయానికి రిలీజ్ అయ్యే అవకాశం కనిపించట్లేదు.