మెగాస్టార్, పవర్ స్టార్ లని ఫాలో అవుతున్న సల్మాన్ ఖాన్

బాలీవుడ్ భాయ్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇప్పటివరకూ హిందీ సినిమాలనే చేశాడు. వాటిని ఇతర భాషల్లో కూడా డబ్ చేయకుండా, కేవలం హిందీ వెర్షన్స్ తో మాత్రమే సౌత్ లో కూడా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు తన మార్కెట్ ని సౌత్ లో మరింత పెంచుకుంటూ దబాంగ్ 3ని అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నాడు. తమిళనాడు లాంటి ఏరియాల్లో ప్రభుదేవా ఇమేజ్ కూడా సల్మాన్ కి బాగా హెల్ప్ అవనుంది. అయితే ఎన్నో సినిమాలు చేసినా, డబ్బింగ్ కి దూరంగా ఉన్న సల్మాన్, దబాంగ్ 3ని మాత్రమే ఎందుకు అన్ని ఇండియన్ లాంగ్వేజ్స్ లో రిలీజ్ చేయాలకుంటున్నాడు అనే క్వేషన్ మాత్రం అందరిలోనూ ఉంది.

salman

ఈ క్వేషన్ తనకి కూడా ఎదురవడంతో, సల్మాన్ ”ఈ సినిమా కథ నేనే రాశా. అందుకని, హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో విడుదల చేయాలనుకున్నాను. ఓడితే అన్ని ప్రాంతాల నుండి తిట్లు పడతాయి కానీ గెలిస్తే… దేశమంతా గెలుస్తాను. ” పైగా దబాంగ్ 3లో సౌత్ఇండియన్ సినిమా ఫార్మాట్‌లో సాగే కథ కథనం ఉన్నాయి. కథ, యాక్షన్‌, డ్యాన్సులు, కామెడీ, ప్రేమ సన్నివేశాలు… ఇలా అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయి. అందుకే అన్ని భాషల్లో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నా అని స్పష్టం చేశాడు. దీంతో దబాంగ్ 3 అన్ని భాషల్లో ఎందుకు రిలీజ్ అవుతుంది అనే ప్రశ్నకి సమాధానం దొరికింది.

ఇదిలా ఉంటే డైరెక్టర్ ప్రభుదేవానే కాబట్టి, దబాంగ్ 3 సినిమాలో సల్మాన్ డాన్స్ కూడా చేసి అలరిస్తాడట. ముఖ్యంగా మెగాస్టార్ ఐకానిక్ మూవీస్ లో ఒకటైన ఇంద్రలో వీణ స్టెప్ ని దబాంగ్ 3లో చూడబోతున్నామని సమాచారం. దాయి దాయి దామ్మా సాంగ్ లో చిరు వేసిన వీణ స్టెప్, ఇంకో పదేళ్లు అయినా మెగా అభిమానులకి గుర్తుండి పోతుంది. ఈ స్టెప్ వేసే అప్పుడు చిరు గ్రేస్ సూపర్బ్ గా ఉంటుంది. లారెన్స్ కొరియోగ్రఫీ చేసిన ఈ స్టెప్ ని సల్మాన్ ఇప్పుడు దబాంగ్ 3లో చూపించబోతున్నాడు. అయితే ఇదే వీణ స్టెప్ ని పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ లో చేసి చూపించాడు. మెగాస్టార్ స్టెప్, పవర్ స్టార్ వేయడంతో మెగా అభిమానులు థియేటర్స్ లో విజిల్స్ వేశారు. మరి ఇప్పుడు సల్మాన్ ఏం చేస్తాడో చూడాలి.