“తలైవి” కంగనాకి షాక్ ఇచ్చిన “ఐరన్ లేడీ” నిత్యా మీనన్…

జయలలిత జీవితం ఆధారంగా తమిళనాడులో చాలా బియోపిక్స్ తెరకెక్కుతున్నాయి. వీటిలో కంగనా మెయిన్ లీడ్ ప్లే చేస్తున్న తలైవి సినిమా ఒకటి. రీసెంట్ గా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ టీజర్ బయటకి వచ్చింది. యంగ్ హీరోయిన్ గా, సీఎం జయలలితగా కనిపించి కంగనా మంచి పేరు తెచ్చుకుంది. అయితే కొంతమంది మాత్రం కంగనాకి మేకప్ ఎక్కువ అయ్యిందంటూ కామెంట్స్ చేశారు. ఈ విషయం తను కూడా వినిందో లేక నార్మల్ గానే చెప్పిందో తెలియదు కానీ నిత్యా మీనన్, హాట్ కామెంట్స్ చేసింది.

ప్రియదర్శిని దర్శకత్వంలో తెరకెక్కుతున్న జయలలిత బయోపిక్‌ ది ఐరన్ లేడీ సినిమాలో నిత్య మీనన్ నటిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన షూట్ కూడా స్టార్ట్ అయ్యింది. నిత్య మీనన్ ఫొటోస్ ని ఫ్యాన్స్ ఎడిట్ చేసి నెట్ లో పెట్టారు. ఈ ఫొటోస్ చూసిన వారు, అచ్చం అమ్మలాగే ఉంది అనే కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఇప్పుడు కంగనా తలైవి ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ బయటకి రావడంతో నిత్య స్పందించింది. `జయలలిత బయోపిక్‌లో నటించే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. ఆమె పాత్రలో నటించడానికి నేనే పర్‌ఫెక్ట్. ఆమె గురించి క్షుణ్నంగా తెలుసుకున్నాను. ఆమెలాగానే నాది కూడా ధైర్యంగా మాట్లాడగలిగే స్వభావం. ఆమెలా మారడానికి ఎంతో కష్టపడుతున్నా. జయలలిత పాత్రకు వంద శాతం న్యాయం చేస్తాన”ని నిత్య తెలిపింది. ఇంత సడన్ గా జయలలిత బయోపిక్ పై నిత్యా మీనన్ స్పందించడానికి కారణం ఏంటి అనే విషయం ఏంటో తెలియదు కానీ చాలా మంది మాత్రం కంగనా టార్గెట్ చేయడానికే ఆమె రెస్పాండ్ అయ్యి ఉంటుంది అంటున్నారు. నిత్యా కౌంటర్ వేసింది సరే, ఎప్పుడూ ఎదో వివాదంలో ఉండే కంగనా ఈ కౌంటర్లకి ఎలా రిప్లై ఇస్తుందో చూడాలి.