డిసెంబర్ 1 నుంచి విరాటపర్వంలోకి రానా దగ్గుబాటి

డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో తెలుగు హిందీ తమిళ భాషల్లో నటిస్తూ బిజీగా ఉండే దగ్గుబాటి రానా, గత కొంతకాలంగా సినిమాలకి దూరంగా ఉన్నాడు. ఫారిన్ నుంచి రిటర్న్ అయిన రానా, వేణు ఉడుగుల దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్ ని మళ్లీ మొదలుపెట్టడానికి రెడీ అయ్యాడు. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా విరాటపర్వంగా ప్రేక్షకుల ముందుకి రానుంది. బాబ్రీ మసీద్ కూల్చివేత, నక్సలిజం లాంటి సోషల్ అండ్ కాంట్రవర్సీ అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ అంతా కంప్లీట్ అయ్యింది కానీ రానా పార్ట్ మాత్రమే ఆగిపోయింది.

rana

రానాకి సంబంధించిన సీన్స్ షూట్ చేయడం అయిపోతే విరాటపర్వం షూటింగ్ అయిపోయినట్లే, ఈ బాలన్స్ పార్ట్ కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ మొదలుపెట్టాలని వేణు ఉడుగుల ప్లాన్ చేస్తున్నాడు. ఫారిన్ నుంచి రిటర్న్ వచ్చినా కూడా రానా షూట్ కి రెడీ కాలేదట, మరికొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని రానా అనుకుంటున్నాడట. ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం రానా డిసెంబర్ 1న విరాటపర్వం షూటింగ్ మొదలుపెట్టాలని భావిస్తున్నాడట.