వినాయక చవితి సందర్భంగా `రాజుగారి గది 3` ఫస్ట్ లుక్‌ని వి.వి.వినాయక్ విడుదల చేశారు. రాజుగారిగది, రాజుగారిగది 2 చిత్రాల తర్వాత ఓంకార్ దర్శకత్వంలో ఈ చిత్రంలో తెరకెక్కుతోంది. అశ్విన్‌బాబు, అవికాగోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ముగిసింది. డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. షబీర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఓక్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది దసరాకు విడుదల చేస్తున్నారు. `రాజుగారిగది 3` ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసిన సందర్భంగా..
వి.వి.వినాయక్ మాట్లాడుతూ – రాజుగారిగది`, `రాజుగారిగది 2` చిత్రాల కంటే `రాజుగారిగది 3` చిత్రం చాలా పెద్ద హిట్ కావాలి. ఓంకార్‌గారు చాలా కష్టపడి కమిట్‌మెంట్‌తో ఈ సినిమా చేస్తున్నారు. అశ్విన్ ఈ సినిమాలో తొలిసారి సోలో హీరోగా నటిస్తున్నాడు. ఓంకార్‌గారు ఓక్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. టీవీ రంగంలో ఓక్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎంత పెద్ద బ్యానర్ అయ్యిందో సినిమా రంగంలోనూ అంతే పెద్ద బ్యానర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాకు పనిచేసిన ఛోటా కె.నాయుడు సహా ఎంటైర్ యూనిట్‌కు వినాయక చవితి శుభాకాంక్షలు“ అన్నారు.
దర్శక నిర్మాత ఓంకార్ మాట్లాడుతూ – రాజుగారిగది` సినిమాను చేసేటప్పుడు ఆ సినిమా గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. అప్పుడు వినాయక్ అన్నయ్య చేతుల మీదుగా వినాయకచవితిరోజునే టీజర్‌ను విడుదల చేశాం. దాని దశ మారిపోయింది. బిజినెస్ అయిపోయింది. నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు వినాయక్ అన్నయ్య చేతుల మీదుగా ఫస్ట్ లుక్ విడుదల చేయడం ఆనందంగా అనిపించింది. `రాజుగారిగది`,`రాజుగారిగది 2`చిత్రాల కంటే ఈ సినిమా కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. ఈ సినిమాకు ఛోటాగారు, గౌతంరాజుగారు, మ్యూజిక్ డైరెక్టర్ షబీర్ సహా ఇతర టెక్నీషియన్స్ అలాగే అశ్విన్, అవికా, అలీగారు, బ్రహ్మాజీగారు, ఊర్వశిగారు ఇలా అందరూ వారి సొంత సినిమాగా భావించి చేయడం వల్ల సినిమా చాలా బాగా వచ్చింది. అన్నీ కుదిరితే ఈ దసరాకు ప్రేక్షకుల ముందుకు వస్తాం“ అన్నారు.
నటీనటులు:
అవికాగోర్
అశ్విన్ బాబు
అలీ
బ్రహ్మాజీ
ప్రభాస్ శ్రీను
హరితేజ
అజయ్ ఘోష్
ఊర్వశి తదితరులు
సాంకేతిక వర్గం:
దర్శకత్వం: ఓంకార్
బ్యానర్: ఓక్ ఎంటర్‌టైన్‌మెంట్స్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కల్యాణి చక్రవర్తి
సినిమాటోగ్రఫీ: ఛోటా కె.నాయుడు
ఎడిటర్: గౌతంరాజు
ప్రొడక్షన్ డిజైనర్: సాహి సురేశ్
డైలాగ్స్: సాయిమాధవ్ బుర్రా
పాటలు: శ‌్రీమణి
ఆడియోగ్రఫీ: రాధాకృష్ణ
స్టంట్స్: వెంకట్
పి.ఆర్.ఒ: వంశీ శేఖర్