సాలిడ్ కంబ్యాక్ ఇస్తాడా?

2017లో ఒక్కడు మిగిలాడు సినిమాతో రిలీజ్ కి ముందు మంచి అంచనాలని క్రియేట్ చేసిన మంచు మనోజ్, ఆ అంచనాలను అందుకోవడంలో తడబడి భారీ ఫ్లాప్ అందుకున్నాడు. ఈ మూవీ తర్వాత దాదాపు మూడేళ్లు గ్యాప్ తీసుకున్న మనోజ్, ఇప్పుడు తన కంబ్యాక్ ప్రాజెక్ట్ ని సెట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. మంచు ఫ్యామిలీ సన్నిహిత వర్గాల నుంచి ఇన్ఫర్మేషన్ ప్రకారం మనోజ్, శ్రీకాంత్ అనే షార్ట్ ఫిల్మ్ మేకర్ చెప్పిన కథని ఓకే చేశాడని తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా అక్టోబర్ లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం మంచు మనోజ్, తన కొత్త సినిమా కోసం బాడీ బిల్డ్ చేసి షేప్ లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్న ఈ ప్రాజెక్ట్ లో కొత్త మంచు మనోజ్ ని చూడబోతున్నామని తెలుస్తోంది. మరి మూడేళ్ల గ్యాప్ తర్వాత సినిమాని మొదలు పెట్టనున్న మంచు మనోజ్ సాలిడ్ కంబ్యాక్ ఇచ్చి సినీ అభిమానులని సంతోష పెడతాడేమో చూడాలి.