రజనీ మరో సంచలన నిర్ణయం.. షాక్‌లో ఫ్యాన్స్

సూపర్‌స్టార్ రజనీకాంత్ మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నారనే వార్తలు హాట్‌టాపిక్‌గా మారాయి. రాజకీయాల్లోకి రాబోనంటూ తలైవా ప్రకటించిన నిర్ణయం సంచలనం రేపింది. అయితే ఇప్పుడు సినిమాలకు కూడా గుడ్‌బై చెప్పే ఆలోచనలో ఆయన ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే తలైవా ఫ్యాన్స్‌కి పెద్ద షాక్ తప్పదని చెప్పవచ్చు. ఇప్పటికే రజనీ రాజకీయాల్లోకి రాకపోవడం పట్ల అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. హఠాత్తుగా ఆయన తీసుకున్న నిర్ణయం ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేసింది.

rajanikanth quit cinemas

ఇప్పుడు సినిమాలకు కూడా గుడ్‌బై చెబితే ఫ్యాన్స్ మరింత అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశముంది. అనారోగ్య కారణాల వల్ల రాజకీయాల్లోకి రాకూడదని నిర్ణయించుకున్నట్లు రజనీ తెలిపారు. త్వరలో అదే కారణం చెప్పి సినిమాల నుంచి కూడా తప్పుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. రజనీ ప్రస్తుతం అన్నాత్తే సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల ఆ సినిమా సెట్‌లో ఏడుగురికి కరోనా రావడంతో.. షూటింగ్ ఆగిపోయింది.

ఆ తర్వాత హైబీపీ కారణంగా రజనీ అపోలో అస్పత్రిలో చేరారు. గతంలో రజనీకి కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ అయింది. అది కాకుండా ఇప్పుడు రజనీ వయస్సు 70 సంవత్సరాలు. కరోనా పరిస్థితుల్లో షూటింగ్‌లలో పాల్గొనడం మరింత ప్రమాదకరం. దీంతో రజనీ సినిమాలకు బ్రేక్ ఇవ్వడమో.. లేదా తప్పుకోవడమా అనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారట.