అవినాష్ బిగ్‌బాస్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్!

జబర్దస్త్‌తో బుల్లితెరకు పరిచయమైన అవినాష్.. తన కామెడీతో ప్రేక్షకులను అలరించాడు. మిగతా కమెడియన్లకు భిన్నంగా తనకంటూ సపరేట్ స్ట్రైల్ కామెడీని అలవర్చుకున్నాడు. జబర్దస్త్‌తో ఫేమస్ అయిన అనినాష్‌కు పలు సినిమాల్లో చిన్న చిన్న అవకాశాలు వచ్చాయి. అయితే బిగ్‌బాస్ 4కు వెళ్లిన తర్వాత అవినాష్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. హౌస్‌లో అందరివాడులా అనిపించుకుని తన కామెడీతో ప్రేక్షకులను అలరించాడు. ఏకంగా నాగార్జున, చిరంజీవిలతో బెస్ట్ ఎంటర్‌టైనర్ అని అనిపించుకున్నాడు.

avinash bigboss remunaration

అరియానాతో అవినాష్ ఫ్రెండ్‌షిప్ అందరికీ బాగా నచ్చింది. హౌస్‌లో బెస్ట్ ఎంటర్‌టైనర్‌గా నిలిచిన అనినాష్ రెమ్యూనరేషన్ గురించి ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అనినాష్ తన రెమ్యూనరేషన్ విషయం బయటపెట్టాడు. రూ.10 లక్షల పైన వచ్చిందని చెప్పుకొచ్చాడు. బిగ్‌బాస్ రెమ్యూనరేషన్‌తో అప్పు మొత్తం తీరిందని చెప్పాడు.