BIG BREAKING:100 అక్యుపెన్సీని వెనక్కి తీసుకోవాల్సిందే

థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇస్తూ తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తుండగా.. మరికొంతమంది మాత్రం విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విజృభిస్తున్న క్రమంలో ఈ నిర్ణయం చాలా డేంజర్ అని డాక్టర్లు చెబుతున్నారు. ఈ నిర్ణయంను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది.

CINEMA THEATERS TAMILANADU

థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం లేఖలో తమిళనాడు ప్రభుత్వాన్ని కోరింది. కేంద్ర ప్రభుత్వం 50 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే థియేటర్లను నడుపుకునేందుకు అనుమతి ఇచ్చిందని, దానిని పట్టించుకోకుండా 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇవ్వడం నిబంధనలను అతిక్రమించడమేనని తెలిపింది.

తమిళనాడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ డిమాండ్ వస్తోంది. ఈ క్రమంలో జీవోను వెనక్కి తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసింది.