మళ్లీ షూటింగ్‌కి రజనీ

సూపర్ స్టార్ రజనీకాంత్ గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో షూటింగ్‌లకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రజనీ అన్నాతే సినిమా షూటింగ్ చేస్తున్నాడు. ఇటీవల హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ జరగ్గా.. షూటింగ్ సిబ్బందిలో ఏడుగురికి కరోనా సోకడం, రజనీ అస్వస్థతకు గురికావడంతో షూటింగ్ మధ్యలో ఆగిపోయింది. హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్‌లో రెండు రోజుల పాటు రజనీ చికిత్స పొందగా.. డిశ్చార్జ్ చేసిన అనంతరం రజనీ చెన్నైకి తిరిగి వెళ్లారు.

RAJANIKANTH ATTEND MOVIE SHOOTINGS

అనారోగ్యం కారణంగా రజనీ రాజకీయాల్లో కూడా రాకూడదని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో రజనీ సినిమాలకు కూడా గుడ్ బై చెబుతారనే ప్రచారం జరిగింది. కానీ త్వరలో రజనీ తిరిగి సినిమా షూటింగ్‌లలో పాల్గొననున్నాడు. త్వరలో అన్నాతే షూటింగ్‌లో రజనీ పాల్గొననున్నాడు. ఫిబ్రవరి మూడో వారం నుంచి ఈ షూటింగ్ ప్రారంభం కానుంది. మిగిలిన షూటింగ్ త్వరగా పూర్తి చేయాలని మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు.