Tollywood: శ‌ర్వానంద్ శ్రీ‌కారం టీజ‌ర్‌ను రిలీజ్ చేసిన మ‌హేశ్‌బాబు!

Tollywood: టాలీవుడ్ యంగ్ హీరో శ‌ర్వానంద్ న‌టిస్తున్న తాజా చిత్రం శ్రీ‌కారం. గ్రామీణ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా తెర‌కెక్కుతుండ‌గా.. ఈ సినిమాతో కిషోర్‌రెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్ల్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. ఈ సినిమాలో శ‌ర్వానంద్ రైతు లుక్‌లో ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేశాడు. ఇక తాజాగా Tollywood సినిమాకు సంబంధించిన టీజ‌ర్‌ను మ‌హేశ్‌బాబు సోష‌ల్ మీడియా వేదిక‌గా రిలీజ్ చేశారు.

srikaaram teaser

ఒక హీరో త‌న‌ కొడుకు హీరోను చేస్తున్నాడు.. ఒక డాక్ట‌ర్ కొడుకు త‌న కొడుకును డాక్ట‌ర్ చేస్తున్నాడు.. అలాగే ఒక‌ ఇంజినీరింగ్ త‌న కొడుకును ఇంజినీరింగ్ చేస్తున్నాడు.. కానీ ఒక రైతు మాత్రం త‌న కొడుకును రైతును చేయ‌డంలేంటి అని ఈ ఒక్క‌టి నాకు జ‌వాబు లేని ప్ర‌శ్న‌గా మిగిలిపోయిందంటూ శ‌ర్వా చెప్పే డైలాగ్‌తో ఈ టీజ‌ర్‌ ప్రారంభం కాగా.. చివ‌ర‌కు శ‌ర్వా ఓ స్పీచ్ ఇచ్చిన‌ట్లు డైలాగ్ చెబుతాడు. చివ‌ర‌కు ఈ టీజ‌ర్ అల‌రిస్తోందిTollywood . ఇక ఈ చిత్రాన్ని 14రీల్స్ బ్యాన‌ర్‌పై రామ్ ఆచంట‌, గోపి ఆచంట నిర్మిస్తుండ‌గా.. ఇందులో శ‌ర్వాకు జోడీగా గ్యాంగ్‌లీడ‌ర్ ఫేం ప్రియాంక అరుళ్ మోహ‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. అలాగే ఈ చిత్రానికి మిక్కిజే.మేయ‌ర్ స్వ‌రాలు అందిస్తుండ‌గా.. మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా మార్చి 11న ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది.‌