దర్శకుడు మారుతి చేతుల మీదగా రాజ్ తరుణ్, రాశి సింగ్ కొత్త సినిమా ప్రారంభం – ఈవెంట్ లో నక్కిన త్రినాధరావు ఎం చేసారో తెలుసా?

కనెక్ట్ మూవీస్ ఎల్.ఎల్. పి నుండి గోవిందరాజు గారు ప్రజెంట్ చేస్తున్న ప్రొడక్షన్ నెంబర్ వన్ సినిమా ప్రారంభ పూజ ఈరోజు రామానాయుడు వీడియోస్ లో ఘనంగా జరిగింది. నూతన దర్శకుడు రమేష్ కడుములు గారిని పరిచయం చేస్తూ రాబోతున్న ఈ సినిమాని మురళీధర్ రెడ్డి, కేఐటిఎన్ శ్రీనివాస్ గారు నిర్మిస్తున్నారు. రాజ్ తరుణ్ హీరోగా రాసి సింగ్ హీరోయిన్గా ఈ సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా పూజ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా డైరెక్టర్ మారుతి గారు, ప్రొడ్యూసర్ ఎస్. కె. ఎన్ గారు, నక్కిన త్రినాధ రావు గారు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వివేక కూచిబొట్ల గారు తదితరులు హాజరయ్యారు. ఈ సినిమాకు డైరెక్టర్ మారుతి క్లాస్ చేయగా ప్రవీణ్ సత్తార్ గారు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అలాగే నక్కిని త్రినాధరావు గారు ఫస్ట్ షార్ట్ డైరెక్ట్ చేయగా ధీరజ్ మొగిలినేని గారు, వంశీ గారు స్క్రిప్ట్ అందజేశారు. పూజ కార్యక్రమం ముగిసిన అనంతరం వారందరూ మీడియా సమక్షంలో మాట్లాడడం జరిగింది.

ఈ సందర్భంగా దర్శకుడు రమేష్ కడుముల మాట్లాడుతూ… ఈ సినిమా షూటింగ్ ఈనెల 15 నుండి ప్రారంభమవుతుందని అలాగే కంటిన్యూ షెడ్యూల్ ఉంటుందని అన్నారు. ఈ సినిమా క్రైమ్ కామెడీగా దోనలో ఉండబడునట్లు స్వామిరారా, రన్ రాజా రన్ సినిమాలో తరహాలో ఉంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ కథకి రాజ్ తరుణ్, రాశి సింగ్ పర్ఫెక్ట్ గా ఉంటారని, అలాగే తనకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు ఎస్ కే ఎన్ గారికి, మారుతి గారికి, నక్కిన త్రినాధరావు రావు గారికి, వంశీ గారికి, అలాగే ధీరజ్ మొగలినేని గారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ… ఈ కథ బాగా నచ్చిందని, అలాగే ఈ కథతో సంవత్సరం నుండి ప్రయాణం చేసినట్లు చెప్పారు. ఈ సినిమా బాగా రావాలని కోరుకుంటూ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులకు అలాగే ముఖ్య అతిథులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

మాధవి అద్దంకి గారు మాట్లాడుతూ…. దర్శకులు రమేష్ కు ఎంతో టాలెంట్ ఉందని, ఆ టాలెంట్ తోనే గొప్ప కథ తీసుకొచ్చారని ఆమె అన్నారు. కథ బాగా నచ్చి ఈ సినిమా తీసుకున్నట్లు గా ఉంటుంది. ఈ సినిమా ప్లాట్ చాలా కొత్తగా ఉంటుంది వెల్లడించారు. ఈ సినిమాకు హీరోగా రాజ్ తరుణ్,హీరోయిన్ రాశి ఆప్ట్ అన్నారు. అలాగే కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ముఖ్య అతిథులకు ధన్యవాదాలు తెలిపారు.

హీరోయిన్ రాశి సింగ్ సినిమా మాట్లాడుతూ… తనకు ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శకులకు ప్రొడ్యూసర్లకు ధన్యవాదాలు తెలిపారు. రాజ్ తరుణ్ తో కలిసి నటించిన తనకు చాలా సంతోషంగా ఉన్నట్లు ఆమె అన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.

హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ… ఈ కథ తనకి బాగా నచ్చినట్లు, త్వరలోనే షూటింగ్ మొదలు పెడుతున్నట్లు ఆయన తెలిపారు. తనకు అవకాశం ఇచ్చిన నిర్మాతలకు దర్శకులకు ధన్యవాదాలు తెలిపారు.

తారాగణం : రాజ్ తరుణ్, రాశి సింగ్
సాంకేతిక నిపుణులు :
బ్యానర్ : కనెక్ట్ మూవీస్ ఎల్.ఎల్. పి
రచన & దర్శకత్వం : రమేష్ కడుముల
ప్రొడ్యూసర్ : మురళీధర్ రెడ్డి, కేఐటిఎన్ శ్రీనివాస్
డిఓపి : ఆదిత్య జవ్వాడి
సంగీతం : శేఖర్ చంద్ర
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
ఆర్ట్ : బేబీ సురేష్ బీమగాని
వీఆర్వో : వంశీ-శేఖర్
పబ్లిసిటీ డిజైనర్ : సుధీర్