భారీ రేటుకు అమ్ముడుపోయిన రాధేశ్యామ్ రైట్స్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కె.రాధాకృష్ణకుమార్ తెరకెక్కిస్తున్న సినిమా రాధేశ్యామ్. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అవ్వగా.. లవర్స్ డే రోజు అయిన ఫిబ్రవరి 14న సినిమాను విడుదల చేయనున్నారు. పాన్ ఇండియా సినిమాగా దీనిని విడుదల చేసేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ పనులు జరుగుతుండగా… ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఒక రేంజ్‌లో జరుగుతోంది.

RADHYE SHYAM RIGHTS

తాజాగా ఈ సినిమా ఓవర్సీస్ డిస్ట్రీబ్యూషన్ రైట్స్‌ను గ్రేట్ ఇండియా ఫిల్మ్స్ సంస్థ ఏకంగా రూ.22 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఏకంగా ఇంత భారీ స్థాయిలో ఓవర్సీస్ రైట్స్ అమ్ముడుపోవడం మంచి పరిణామమే అని చెప్పవచ్చు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు.