ఇకపై అలాంటి సినిమాలు చేయనంటున్న హాట్ బ్యూటీ

ఇకపై అలాంటి సినిమాలు చేయనంటోంది బాలీవుడ్ హాట్ బ్యూటీ రాధికా ఆప్టే. రక్త చరిత్ర, రక్తచరిత్ర 2, లయన్, లెజెండ్ వంటి సినిమాలతో తెలుగులోనూ హీరోయిన్‌గా పేరు సంపాదించుకున్న ఈ అమ్మడు.. తమిళం, బెంగాలీ, మరాఠీ సినిమాల్లో కూడా నటించింది. ఇక పలు ఓటీటీలలో వెబ్ సిరీస్‌లలోనూ ఈ భామ సత్తా చాటుతోంది.

RADHIKA APTE COMMENTS

ఈ క్రమంలో తాజాగా ఒక ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాధిక ఆప్టే సంచలన విషయం బయటపెట్టింది. ఇకవైపు కథ నచ్చితేనే సినిమాలకు ఒకే చెబుతానని, నచ్చకపోతే మెహమాటం లేకుండా నో చెబుతానంటోంది. ఇతరులు ఎక్కవ ప్రాజెక్టులు చేస్తున్నారు కదా అని స్ట్రెస్‌లో పడకూడదని నిర్ణయించుకున్నానని తెలిపింది. చాలా సార్లు ప్రాజెక్ట్ మిస్ అవుతుందనే భయంతో ఇన్సెక్యూరిటీతో కొన్ని సినిమాలు చేస్తానని తెలిపింది. అలాంటి ప్రాజెక్టులు సక్సెస్ అయినా కాకపోయినా సంతృప్తి మాత్రం ఉండదని తెలిపింది.