కృష్ణా జిల్లాలో విశాల్ సంద‌డి.. అభిమానుల‌తో కోడి పందాల వీక్ష‌ణ‌!

ప్ర‌ముఖ కొలీవుడ్ నటుడు విశాల్ సంక్రాంతి సంద‌ర్భంగా కృష్ణా జిల్లాలో సంద‌డి చేశారు. జిల్లాలోని గుడ్ల‌వ‌ల్లేరు మండ‌లంలోని డోకిప‌ర్రులో పుర‌స్క‌రించుకొని గురువారం కోడి పందాల‌ను విశాల్ తిల‌కించారు. అంత‌కుముందు.. గ్రామంలోని శ్రీ భూ స‌మేత వెంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌యాన్ని సంద‌ర్శించి ప్ర‌త్యేక పూజ‌లు చేశాడు విశాల్‌..

vishal krishna dist

అలాగే విశాల్‌తో పాటు మేఘా సంస్థ ఎండీ, ఆల‌య నిర్మాత పీవీ కృష్ణారెడ్డితో క‌లిసి స్వామివారి దైనందిని, కాల‌మానిని ఆవిష్క‌రించాడు. అనంత‌రం స్థానిక విశ్రాంతి మందిరం ఆవ‌ర‌ణ‌లో ఏర్పాటు చేసిన కోడి పందాల‌ను విశాల్‌, పీవీ కృష్ణారెడ్డి క‌లిసి తిల‌కించారు. ఈ నేప‌థ్యంలో విశాల్ రాక‌ను తెలుసుకున్న అక్క‌డి వాళ్లు భారీ సంఖ్య‌లో ఆయ‌న్ను చూసేందుకు త‌ర‌లివ‌చ్చారు.