‘క్రాక్‌’ సినిమాకు రవితేజ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కించిన క్రాక్ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సంపాదించుకుంటోంది. శృతిహాసన్ హీరోగా నటించిన ఈ సినిమాను ఠాగూర్ మధు నిర్మించగా.. థమన్ మ్యూజిక్ అందించాడు. ఇప్పటివరకు ఈ సినిమా రూ.18.58 కోట్లు వసూలు చేయగా.. సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 17.5 కోట్లు జరిగింది.

RAVITEJA KRACK REMUNARATION

ఐదు రోజుల్లో రూ. 18.58 కోట్లు రాబట్టడంతో రూ. కోటి పైగానే లాభాలను అందుకుంది. అయితే ఈ హిట్ సినిమాకు రవితేజ తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి ఒక వార్త హాట్‌టాపిక్‌గా మారింది. ఈ సినిమాకు రవితేజ ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదట. రెమ్యూనరేషన్‌కు బదులుగా నైజాం, వైజాగ్ ఏరియాల నుంచి వచ్చే కలెక్షన్లను రెమ్యూనరేషన్‌గా తీసుకోనున్నారట.

నైజాం, వైజాగ్ ఏరియాల నుంచి రూ.10 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్లు వచ్చే అవకాశాలున్నాయి. మాములుగా ఒక్కో సినిమాకు రవితేజ రూ.10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటాడు.