Tollywood: ‘రాగల 24 గంటల్లో’ చిత్రంతో పరిచయమయ్యి మొదటి చిత్రంతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో అనురాగ్. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడుఢమరుకం
ఫేమ్ శ్రీనివాసరెడ్డి స్క్రీన్‌ప్లే, దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన చిత్రం ‘రాధాకృష్ణ’. అనురాగ్, ముస్కాన్ సేథీ (పైసా వసూల్ ఫేమ్) హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో నందమూరి లక్ష్మీ పార్వతి ఒక కీలకపాత్ర పోషించారు. టి.డి.ప్రసాద్ వర్మ దర్శకత్వం వహించిన Tollywood ఈ చిత్రాన్ని హరిణి ఆరాధ్య క్రియేషన్స్ పతాకంపై పుప్పాల సాగరిక కృష్ణకుమార్ నిర్మించారు. ఫిబ్రవరి 5న సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యి సక్సెస్ ఫుల్ టాక్ తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా హీరో అనురాగ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
నేను హైదరాబాదీని. ఇంటీరియర్ డిజైనింగ్ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చాను. మా ఫ్యామిలీ నన్ను బాగా సపోర్ట్ చేస్తుంది. నా కుటుంబ సభ్యుల సపోర్ట్ వల్లే నేను హీరో కాగలిగాను. Tollywood ఇండస్ట్రీలో అలీ గారు నాకు పరిచయం. ఆయన ద్వారా శ్రీనివాసరెడ్డి గారిని కలిశాం. నా గురించి ఆలీ గారు శ్రీనివాసరెడ్డి గారికి చెప్పారు. అప్పట్నుంచి వారితో నాకు మంచి సాన్నిహిత్యం మొదలైంది. వారు చెప్పడం వల్ల ‘రాగల 24 గంటల్లో’ సినిమాలోని ముగ్గురు హీరోల్లో ఒకరిగా చేశాను. నా యాక్టింగ్ బాగా నచ్చి నన్ను ‘రాధాకృష్ణ’ మూవీకి రికమండ్ చేశారు. అలా రాధాకృష్ణ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. శ్రీనివాసరెడ్డి గారి వల్ల Tollywood ఈ సినిమా ఇప్పుడు ఇంత సక్సెస్ అయ్యింది. మెయిన్ లీడ్ క్యారెక్టర్ నన్ను చేయడమనడం నాకు పెద్ద విషయంగా అనిపించింది. ‘రాగల 24 గంటల్లో’ సినిమాలో నా క్యారెక్టర్ డ్యూరేషన్ తక్కువగా ఉంటుంది. రాధాకృష్ణ లో చేయమనగానే చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది. ఒక పక్క టెన్షన్‌గా ఉంది. మరోవైపు ఎగ్జైట్మెంట్. రాధాకృష్ణ సినిమాలో మంచి క్యారెక్టర్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. నిర్మల్ బొమ్మల బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయడాన్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నిర్మల్ బొమ్మల ప్రసిద్ధి గురించి ఇప్పటి వారికి అంతగా తెలియదు.Tollywood ఈ సినిమా ద్వారా ఓ మంచి సందేశం నా ద్వారా వెల్లడం చాలా ఆనందంగా ఉంది. నిర్మల్ బొమ్మలను తయారు చేసే వారి కష్టం తెలిసింది. మన సంస్కృతిను కాపాడుకోవాలి. మాటల్లో చెప్పలేను వారి కష్టాన్ని. వారికి ఈ సినిమా ద్వారా పరోక్షం గా హెల్ప్ చేశామని మాకు అనిపిస్తోంది. అమేజింగ్ షూటింగ్ ఎక్స్పీరియన్స్. మన దగ్గర కూడ ఇంత మంచి లొకేషన్స్ ఉన్నాయా? అనిపించింది. Tollywood చిత్ర యూనిట్ అందరు బాగా సహకరించారు. శ్రీనివాస రెడ్డిగారి స్క్రీన్ ప్లే కు ఓ డిఫరెంట్ యాంగిల్ ఉంటుంది. కొత్త విషయాలను నేర్చుకున్నాను. ముస్కాన్ హార్డ్ వర్కింగ్ హీరోయిన్. మేజర్ గా కొత్తవారు ఉన్నా….ఎక్స్పీరియన్స్ ఉన్నవారు కూడ ఉన్నారు. ప్రసాద్ అన్న శ్రీనివాసరెడ్డి గారి దగ్గర పనిచేశారు. ప్రసాద్ గారికి ఆ అనుభవం ఉంది కాబట్టి మా పని సులువు అయ్యింది. శ్రీలేఖ గారు మంచి సంగీతం అందించారు. చిన్న సినిమా అని ఆమె అనుకోలేదు. మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. థియేటర్లో సినిమాను చూసినప్పుడు ప్రేక్షకులు ఎమోషనల్ అయ్యారు. మేం కూడా భావోద్వేగానికి లోనయ్యాం. మా టీమ్ అంతా కష్టపడి మంచి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాం. చాలా ఆనందంగా ఉంది. ఒక యాక్టర్ గా అన్ని రకాల పాత్రలు చేయాలనుకుంటున్నాను. ఎప్పటికప్పుడు నన్ను నేను సిల్వర్ స్క్రీన్ పై కొత్తగా చూడాలనుకుంటున్నాను. ఇప్పుడు చేస్తున్న సినిమాలో ఓ మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. అది ప్రేక్షకులకు నచ్చుతుందని అనురాగ్ పేర్కొన్నారు.