వడ్డే నవీన్.. జూనియర్ ఎన్టీఆర్‌కు బావ అవుతాడనే విషయం మీకు తెలుసా?

టాలీవుడ్‌లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాప్ హీరోగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో ఎన్టీఆర్‌కి సంబంధించిన ప్రతి వార్త హాట్‌టాపిక్‌గా మారుతూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జూనియర్ ఎన్టీఆర్‌కు వడ్డే నవీన్ బావ అవుతాడనే విషయం చాలామందికి తెలియదు. ఎన్టీఆర్ కుమారులలో ఒకరైన రామకృష్ణ కూతురు  చాముండేశ్వరిని వడ్డే నవీన్ వివాహం చేసుకున్నారు. రామకృష్ణ కూతురుని వివాహం చేసుకోవడం ద్వారా వడ్డే నవీన్ జూనియర్ ఎన్టీఆర్ కి బావ అయ్యాడన్న మాట.

NTR AND VADDE NAVEEN

అయితే కొన్ని కారణాల వల్ల వడ్డే నవీన్ మొదటి భార్యతో విడిపోయి రెండో పెళ్లి చేసుకోగా.. వీరికి ఒక అబ్బాయి, అమ్మాయి ఉన్నారు. హీరోగా గతంలో వడ్డే నవీన్ పలు సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. చివరిగా 2016లో అటాక్ అనే సినిమా వడ్డే నవీన్ చేశాడు. ఆ తర్వాత సినీ పరిశ్రమకు పూర్తిగా దూరమయ్యాడు. ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ కుమారుడే వడ్డే నవీన్.