పుష్ప షూటింగ్ ఆగిపోవడానికి కారణం… : బన్నీ వాస్

GA2 ప్రొడెక్షన్స్ లో రాబోతున్న ఆయ్ సినిమా నుండి ఇటీవలే ఆయ్ థీమ్ సాంగ్ విడుదల కావడం జరిగింది. ఈ సాంగ్ లాంచ్ కి గాను హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో అల్లు అరవింద్ గారు, బన్నీ వాస్ గారు రావడం జరిగింది. సాంగ్ లాంచ్ చేసిన తరువాత మీడియా తో ముచ్చటించడం జరిగింది. అయితే ఆ సమావేశంలో మీడియా వారు పుష్ప 2 సినిమా గురించి ప్రశ్నించడం జరిగింది. అయితే మీడియా వారి ప్రశ్నలకు సమాధంగా బన్నీ వాస్ గారు మాట్లాడుతూ ఇలా అన్నారు. పుష్ప సినిమా గురించి కొన్ని మీడియాలలో వచ్చే న్యూస్ చూసి వారికి నవ్వొస్తుంది అని అన్నారు. పుష్ప సినిమా ఇంకా పూర్తిగా షూటింగ్ అవ్వలేదని, ఎడిటింగ్ పనులు కొంచం సమయం తీసుకునేలా ఉన్నాయ్ అని, సుకుమార్ గారు అల్లు అర్జున్ తో అనడంతో ఆయన తన గడ్డంని కొంచం ట్రిమ్ చేసారని ఆయన అన్నారు. అలాగే మరో 15 నుండి 20 రోజుల్లోనే పుష్ప సినిమా షూటింగ్ మొదలు కాబోతుంది అని అన్నారు.

సుకుమార్ గారు ఇప్పటి వరుకు జరిగిన సినిమాను ఒకసారి చూసుకుని ఒకేసారి మిగతా షూటింగ్ పెట్టుకునే ఉద్దేశం లో ఉన్నారని ఆయన అన్నారు. దానికి గాను ఆగష్టు మొదటి వారం నుండి పుష్ప షూట్ చేసే ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తుంది. పాన్ ఇండియా స్థాయి పుష్ప సినిమాను మేము లైట్ తీసుకోము, నాకు అల్లు అరవింద్ గారికి, సుకుమార్ గారికి, అల్లు అర్జున్ గారికి ఉన్న బాండింగ్ జీవితాంతం ఇలాగే ఉండబోతుంది అని ఆయన అన్నారు.