అలా బలయ్యాను.. పవన్‌ను ప్రస్తావిస్తూ పూనమ్ సంచలన వ్యాఖ్యలు

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌ ఒక ఊసరవెల్లి అంటూ ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు వివాదం రేపిన విషయం తెలిసిందే. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తొలుత బీజేపీకి పవన్ మద్దతు ప్రకటించడాన్ని ప్రకాశ్ విమర్శించారు. అంతకుముందు బీజేపీకి మద్దతిచ్చిన పవన్.. గత ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలతో కలిసి పనిచేశారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ బీజేపీతో కలవడంపై ప్రకాశ్ రాజ్ మండిపడ్డారు. పవన్‌పై ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా కాగా.. ప్రకాశ్ రాజ్‌కు మెగా బ్రదర్ నాగబాబు కౌంటర్ ఇచ్చారు.

punam kaur

ప్రకాశ్ రాజ్ నోరు అదుపులో పెట్టుకోవాలంటూ నాగబాబు కౌంటర్ ఇవ్వగా.. మీ భాష నాకు రాదు అంటూ ప్రకాశ్ రాజ్ రీ కౌంటర్ ఇచ్చారు. ఈ వివాదం ఇప్పుడు ముగియగా.. దీనిని మళ్లీ నటి పూనమ్ కౌర్ తీసుకొచ్చింది. పవన్‌పై ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు మీడియాలో కావాలని ఇష్యూని జనాలల్లోకి తీసుకెళ్లారని, ఇప్పుడు అదే ప్రకాశ్ రాజ్ రైతు సమస్యలపై ట్వీట్ చేస్తే మీడియా పట్టించుకోవడం లేదంటూ పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది.

ప్రతి మీడియా సంస్థకు వారి వారి సొంత ఎజెండాలు ఉంటాయని పూనమ్ కౌర్ ట్వీట్‌పై ప్రకాశ్ రాజ్ కామెంట్ చేశారు. ‘అవును సర్.. అలాంటి ఎజెండాల వల్లనే నేను బలయ్యాను’ అంటూ పూనమ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.