మహేష్ బాబు కూతురికి RRR హీరోయిన్ అదిరిపోయే గిఫ్ట్

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమాలో రాంచరణ్‌కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ నటిస్తోన్న విషయం తెలిసిందే. గత కొద్దిరోజుల నుంచి హైదరాబాద్‌లోని ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా.. ఇందులో పాల్గొనేందుకు తాజాగా అలియా భట్ హైదరాబాద్‌కు వచ్చింది. అలియా భట్ సెట్రో అడుగుపెట్టిన ఫొటోను రాజమౌళి తాజాగా సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారు. ఈ ఫొటోలో అలియా భట్‌తో రాజమౌళి మాట్లాడుతున్నారు.

alia butt

హైదరాబాద్ వచ్చిన అలియా భట్.. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీని కలిసింది. ఈ సందర్భంగా మహేష్ గారాలపట్టి సీతార కోసం ఒక మంచి డ్రెస్ తీసుకొచ్చి గిఫ్ట్‌గా ఇచ్చింది. ఎడమామా అనే బ్రాండ్‌కు చెందిన డ్రెస్‌ను గిఫ్ట్‌గా ఇచ్చింది. ఈ డ్రెస్ వేసుకున్న సితారా ఫొటోలుకు ఫోలిలిచ్చి అలియాకు థ్యాంక్స్ చెప్పింది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇక నమ్రతా కూడా అలియాకు థ్యాంక్స్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. మహేష్ భార్య నమ్రతా, అలియా భట్ ఎప్పటినుంచో మంచి ఫ్రెండ్. అందుకే హైదరాబాద్ వచ్చినప్పుడల్లా మహేష్ ఫ్యామిలీని అలియా కలుస్తూ ఉంటుంది.