వెబ్‌సిరీస్‌లో సూర్య… లుక్ వైరల్

ప్రముఖ దర్శకుడు మణిరత్నం నిర్మాతగా మారి వెబ్‌సిరీస్‌లు రూపొందిస్తున్నాడు. తొమ్మిది కథలతో నవరస అనే వెబ్‌సిరీస్‌ను రూపొందిస్తుండగా.. ఇందులో ఒక కథలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్నాడు. ఈ కథకు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ వెబ్‌సిరీస్‌లో షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. తాజాగా ఆ వెబ్‌సిరీస్ షూటింగ్‌లో సూర్య పాల్గొన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

surya

ఇందులో సూర్య కొత్త లుక్‌లో స్మార్ట్‌గా కనిపించాడు. గడ్డం తీసేని క్లీన్ షేవ్‌లో కనిపించాడు. ఒక్కో ఎపిసోడ్‌లో ఒక హీరో నటించనుండగా.. ఒక్కో ఎపిసోడ్‌ను ఒక్కో డైరెక్టర్ తెరకెక్కించనున్నాడు. మణిరత్నం స్వయంగా ఒక ఎపిసోడ్‌కు దర్శకత్వం వహించనున్నాడు. ఈ వెబ్‌సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. ఈ వెబ్‌సిరీస్ ద్వారా దాదాపు 12 ఏళ్ల తర్వాత గౌతమ్ మీనన్ డైరెక్షన్‌లో సూర్య నటిస్తుండటం విశేషం.

ఇటీవలే ఆకాశమే నీ హద్దురా సినిమాతో సూర్య బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు. అయితే తొలిసారి సూర్య వెబ్‌సిరీస్‌లో నటిస్తుండటంతో.. దీనిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇక వెబ్‌సిరీస్‌ మిగతా ఎపిసోడ్‌లలో నీత్య మీనన్, ఐశర్య రాజేష్, అరవింద్ స్వామి, సిద్ధార్థ్, విజయ్ సేతుపతి, ప్రకాశ్ రాజ్ నటించునున్నారు.