ఆదివారం ఈనాడు పేపర్లో ప్రచురించిన తుకాణం, ఆంజమ్మ దంపతుల దయనీయ కథ చూసి నిర్మాత బన్నీ వాసు గారు వెంటనే స్పందించి వారిని వృద్ధాశ్రమం కి తరలించి వారికి ఆర్ధిక సహాయం అందించాలని నిర్ణయించి బన్నీ వాసు స్నేహితుడు ప్రముఖ పి. అర్. ఓ. ఏలూరు శ్రీను గారిని హనుమాన్ జంక్షన్ కి పంపించారు.. స్థానికులు అక్కడే వారికీ వసతి గృహం కల్పిస్తామని చెప్పగా బన్నీ వాసు గారి పేరు మీద. వారికి 50. వేల రూపాయలు ఏలూరు శ్రీను గారు ఆర్థిక సహాయం అందచేశారు. ఈ కార్యక్రమం లో పి. అర్. ఓ .లక్ష్మీ నివాస్, మెగాభిమాని మవులూరి అంజిబాబు, గంధం రామారావు, సి హెచ్.రాజేష్, కె.మహేష్ లు హాజరయ్యారు