‘ప్రభాస్’ సినిమా కోసం ‘పెంగ్విన్’ టెక్నీషియన్!!

ఇటీవల టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమా ‘ఆదిపురుష్’ టైటిల్ లుక్ విడుదలైన విషయం తెలిసిందే. రామాయణం యొక్క ఎపిక్ కథ ఆధారంగా రూపొందనున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నాడు. ఇక సినిమాలో సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా కనిపించనున్న విషయం తెలిసిందే.

అయితే ప్రాజెక్ట్ కి సంబంధించిన మరో కీలక అప్డేట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ‘పెంగ్విన్’ సినిమాకు వర్క్ చేసిన యువ సినిమాటోగ్రాఫర్ ఖార్తిక్ పళని ‘ఆదిపురుష్’ కోసం డిఓపిగా ఎంపికైనట్లు తెలుస్తోంది. కీర్తి సురేష్ నటించిన ‘పెంగ్విన్’ సినిమా అనుకున్నంతగా హిట్ టాక్ అందుకోకపోయినా కూడా అందులో ప్రతి ఫ్రేమ్‌ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇక ఇప్పుడు ఆ టెక్నీషియన్ ప్రభాస్ సినిమా కోసం సినిమాటోగ్రఫర్ గా చేయడానికి రెడీ అవుతున్నట్లు టాక్.