‘బిగ్ బాస్ 14′: ఈ సారి చాలా స్పెషల్..’షాపింగ్’, ‘థియేటర్’‌కూడా!!

మరోసారి సల్మాన్ ఖాన్ హోస్ట్ గా చేయనున్న బిగ్ బాస్ 14 చాలా స్పెషల్ గా రెడీ కానుంది. కంటెస్టెంట్స్ మాల్‌లో షాపింగ్ చేయడం, థియేటర్‌లో సినిమాలు చూడటం అలాగే స్పా సెషన్‌లను కూడా ఎంజాయ్ చేస్తారట. బిగ్ బాస్ 13 ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఈ సారి అంతకంటే హై లెవెల్లో ఉండాలని నిర్వాహకులు భారీ ప్లాన్స్ చేస్తున్నారు.

బిగ్ బాస్ 14 అక్టోబర్‌లో ప్రారంభం కానుండటంతో ఇప్పటికే అంచనాల డోస్ బాగా పెరిగిపోయింది. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేయడానికి సిద్ధమయ్యాడు. కొన్ని ప్రోమోలను కూడా రిలీజ్ చేయగా అవి సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. ఇక బిగ్ బాస్ హౌజ్ లో ప్రత్యేకమైన థియేటర్ తో పాటు షాపింగ్ అనుభవం కలిగేలా ఏర్పాట్లు చేయనున్నారట. బిగ్ బాస్ 14 కోసం, ఇంట్లోనే ఒక మాల్, మినీ థియేటర్, స్పా మరియు స్టైల్డ్ రెస్టారెంట్ కార్నర్‌ను కూడా ఉంచేలా హౌజ్ ని రెడీ చేస్తున్నట్లు టాక్. మరి ఈ రూమర్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.