‘స్టార్’ దర్శకుడితో అఖిల్ 5వ సినిమా ఫిక్స్!!

మొత్తానికి మొన్నటివరకు వచ్చిన రూమర్స్ నిజమయ్యాయి. అఖిల్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో ఒక మాస్ చిత్రం రానుందని గత కొన్నిరోజులుగా సినిమా ఇండస్ట్రీలో జోరుగా కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే ఫైనల్ గా అదే నిజమైంది. అనిల్ సుంకర నిర్మాతగా AK ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ఈ సినిమా రూపొందనున్నట్లు అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు.

నిన్నటి నుంచే సోషల్ మీడియాలో AS అప్డేట్ అంటూ ఒక వీడియోను వైరల్ అయ్యేలా చేశారు. ఇక ఈ రోజు 9వ తేది 9గంటల 9నిమిషాల 9 సేకన్లకు అఫిషియల్ గా అప్డేట్ ఇచ్చారు. ఇక త్వరలో సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలుస్తాయని చెబుతున్నారు. అయితే ఈ సినిమా ఒక స్పై యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్నట్లు మరొక టాక్ వినిపిస్తోంది. సరైన విజయాలు లేక సతమతమవుతున్న అఖిల్ నెక్స్ట్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు 5వ సినిమాను సురేందర్ రెడ్డి లాంటి స్టార్ డైరెక్టర్ తో ఫిక్స్ చేసుకోవడంతో భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.

దర్శకత్వం: సురేందర్ రెడ్డి

నిర్మాత: రామబ్రహ్మం సుంకర

కో ప్రొడ్యూసర్స్: అజయ్ సుంకర, పతి దీపా రెడ్డి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికపాటి