అయ్యప్ప మాలలోప్రొడ్యూసర్‌ బన్నీవాస్‌

కిరణ్‌ అబ్బవరం హీరోగా నటించిన చిత్రం ‘క’. తన్వీరామ్‌, నయన సారిక హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రానికి సుజీత్‌, సందీప్‌ దర్శకులు. చింతా గోపాల్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం దిశగా పయనిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం గ్రాండ్‌ సక్సెస్‌ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న బన్నీవాస్ ‘క’ టీమ్‌ను అభినందించారు.

ఆయన మాట్లాడుతూ ”నాకు మనస్పూర్తిగా అనిపిస్తే తప్ప నేను ఇలాంటి వేడుకలకు రాను. ఈసినిమా గురించి మనస్పూర్తిగా మాట్లాడాలి అని అనుకున్నాను. అందుకే వచ్చాను. నాకు ఈ సినిమా నిజంగా బాగా నచ్చింది. నేను ఎన్నో కథలు విన్నాను. ఎన్నో వందల కథలు వినడం వల్ల సినిమా గురించి ఎంతో కొంత ఎక్స్‌పెక్ట్‌ చేస్తాం. కానీ ఈ సినిమా క్లైమాక్స్‌ నేను ఎక్స్‌ పెక్ట్‌ చేయలేదు. ఇలాంటి పతాక సన్నివేశాలు వస్తాయని నేను గెస్‌ చేయలేదు. ఈ మధ్య కాలంలో గ్రేట్‌ స్క్రీన్‌ప్లే ఇది. స్క్రీన్‌ప్లేలో చిన్న తప్పు కూడా లేదు.. ఈ మధ్య కాలంలో చూసిన బెస్ట్‌ స్క్రీన్‌ప్లే ఇది. పతాక సన్నివేశాల్లో ఈ సినిమా స్క్రీన్‌ప్లే విషయంలో క్లాప్స్‌ పడ్డాయి. మీరు ఎంత గొప్ప రచయిత అయినా ఈ సినిమా క్లైమాక్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేస్తే మీరు దేవుళ్లతో సమానం.ఈ సినిమాలో పనిచేసిన అందరికి శుభాకాంక్షలు. అందరికి మంచి భవిష్యత్‌ వుండాలని కోరుకుంటున్నాను.ఈ నిర్మాత గట్స్‌ అభినందనీయం. ఈ సినిమా బడ్జెట్‌ విని షాక్‌ అయ్యాను. కిరణ్‌, వంశీ నాకు నా మనసుకు దగ్గరయిన వ్యక్తులు. వంశీ నందిపాటి నాకు రేట్‌ చెప్పకుండా కొన్నాడు. రేట్‌ తెలిసి షాక్‌ అయ్యాను. నాకు కూడా ఈ నెంబర్‌ తెలిసి కంగారు పడ్డాను. సినిమా చూసిన తరువాత వీళ్ల క్యాలికేలేషన్స్‌ వంశీ నమ్మకం నిజమైంది. వంశీ సినిమాను నమ్మాడు కాబట్టే ఈ రోజు డబ్బులు వచ్చాయి. సినీ పరిశ్రమలో ఛాన్స్‌ క్రియేట్‌ చేసుకున్న వ్యక్తులు ఎదుగుతారు. కిరణ్‌ అవకాశం క్రియేట్‌ చేసుకున్నాడు.కిరణ్‌ చాలా కషపడ్డాడు. చాలా మంది కిరణ్‌ పడిపోయాడు. ఇక పని అయిపోయింది అన్నారు. కానీ అతను ఫైట్‌ ఆపలేదు. ఆట ఓడిపోవడం అంటే ఆ ఆటగాడు ఆటను వదిలేసినప్పుడే కిరణ్‌ ఎప్పుడు సినిమాను వదల్లేదు. అందుకే కిరణ్‌ గెలిచాడు. కిరణ్‌ ను చూస్తే ఇన్‌స్పిరేషన్‌ వస్తుంది. సక్సెస్‌ పాయింట్‌ వద్దకు వెళ్లే వరకు ఫైట్‌ చేయాలి. ఈ టీమ్‌ మరిన్ని విజయాలు అందుకోవాలి అన్నారు.