రచ్చ గెలిచి ఇంట గెలవడానికి రెడీ అయ్యింది

నాని సినిమాతో తెలుగులో డెబ్యూ ఇచ్చిన హీరోయిన్స్ లిస్ట్ లో చాలా మంది టాలెంటెడ్ అమ్మాయిలు ఉన్నారు. ఈ లిస్ట్ లో లేటెస్ట్ గా చేరిన బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్. ఎక్కడ గ్లామర్ షో చేయకుండా, ఇంటిమేట్ సీన్స్ లో నటించకుండా ట్రేడిషల్ లుక్ లో కూడా అందంగా కనిపించిన ప్రియాంక నటనతో తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఎవరైనా ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు కానీ ప్రియాంక మాత్రం ముందు రచ్చ గెలిచి ఇంట గెలవడానికి రెడీ అవుతోంది. అర్ధం కాలేదా? గ్యాంగ్ లీడర్ సినిమాతో టాలీవుడ్ లో డీసెంట్ డెబ్యూ ఇచ్చిన ప్రియాంక ఇప్పుడు కోలీవుడ్ లోకి ఎంటర్ కాబోతోంది.

నమ్మ వీటు పుల్లై సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శివ కార్తికేయన్ నెక్స్ట్ సినిమాలో ప్రియాంక హీరోయిన్ గా సెలక్ట్ అయ్యింది. మ‌న‌కు తెలుగులో నాని ఎలాగో, త‌మిళ ప్రేక్ష‌కుల‌కు శివ కార్తికేయ‌న్ కూడా అలాగే. డీసెంట్ హిట్స్ ఇస్తూ కెరీర్ బిల్డ్ చేసుకున్న శివ కార్తికేయన్, న‌య‌న‌తార‌తో కోకో కోకిల‌ చిత్రాన్ని రూపొందించిన నెల్స‌న్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వ‌చ్చే ఏడాది మొద‌లుకానున్న ఈ మూవీలో ప్రియాంక హీరోయిన్ గా నటిస్తోంది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెలుగులో మొదటి సినిమా చేసినా కూడా ప్రియాంక తమిళ్ అమ్మాయి కాబట్టి శివ కార్తికేయ‌న్ సినిమాకు తానే డ‌బ్బింగ్ చెప్పుకునే అవకాశం ఉంది. ఆమె పాత్ర గురించి డీటైల్స్ తెలియాల్సి ఉంది. తెలుగులో మొదటి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక అరుళ్ మోహన్, సొంతగడ్డపై ఎలాంటి డెబ్యూ ఇస్తుంది అనేది చూడాలి.