వరుణ్ తేజ్ టైటిల్ తో గోపీచంద్ సినిమా

వరుణ్ తేజ్ నటించిన వాల్మీకి సినిమా చూసిన ప్రతి ఒక్కరికి అందులో గద్దలకొండ గణేష్ పై అథర్వ తీసిన సినిమా గుర్తుండే ఉంటుంది. సీటిమార్ పేరుతో తీసిన ఈ సినిమాకి థియేటర్స్ లో విజిల్స్ పడ్డాయి. సినిమాలో తీసిన సినిమాకి పెట్టిన ఈ టైటిల్ తో ఇప్పుడు యాక్షన్ హీరో గోపీచంద్ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఇప్పటికే చాణక్య సినిమాని రిలీజ్ కి రెడీ చేసిన గోపీచంద్, సంపత్ నందితో ఒక సినిమా మొదలు పెట్టాడు. ఈ మూవీకి సీటిమార్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. నిజానికి గోపీచంద్ కి టైటిల్ సెంటిమెంట్స్ ఎక్కువ, గతంలో ల‌క్ష్యం, సౌఖ్యం, లౌక్యం, శౌర్యం, శంఖం… ఇలా ఆయ‌న సినిమాల పేర్ల‌న్నీ దాదాపుగా ఒకే ర‌కంగా ఉంటాయి.

ఈసారి సున్నా మార్క్ నుంచి బయటకి వచ్చిన గోపీచంద్, పూరితో గోలీమార్ అనే సినిమా చేశారు. ఈ మూవీ గోపీచంద్ కి మంచి హిట్ ఇచ్చింది. ఇప్పుడు గోలీమార్ టైటిల్ సెంటిమెంట్ ని ఫాలో అవుతూ సీటీమార్ అనే టైటిల్ ఫిక్స్ చేశారా? లేక కథకి సెట్ అయ్యేలా ఫిక్స్ చేశారా అనేది తెలియదు కానీ మాసీగా ఉన్న టైటిల్ ని మాత్రం క్యాచ్ చేశాడు. ఈ చిత్రంలో త‌మ‌న్నా నాయిక‌గా న‌టించ‌నుంది. సిల్వ‌ర్ స్క్రీన్స్ ప‌తాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వ‌ర‌లోనే రెగ్యులర్ షూటింగ్ కోసం సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. గోపీచంద్ ది పక్కా మాస్ హీరో ఇమేజ్ కానీ దానికి దూరంగా వచ్చి ఫ్యామిలీ ఎంటెర్టైనెర్స్ చేశాడు. ఇప్పుడు మాస్ ప‌ల్స్ బాగా తెలిసిన డైర‌క్ట‌ర్ సంప‌త్‌ సీటిమార్ టైటిల్ తో సినిమా చేస్తే మాత్రం గోపీచంద్ తన మ్యాచో స్టార్ ట్యాగ్ కి జస్టిఫై చేసినట్లే.