సుబ్బు రచనా దర్శకత్వంలో రాజేష్ దండ, బాలాజీ గుట్ట నిర్మాతలుగా అల్లరి నరేష్, అమృత అయ్యర్ జంటగా నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం బచ్చలమల్లి. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించుగా రీఛార్జ్ ఎం నాథన్ సినిమాటోగ్రఫీ గా పని చేశారు. రావు రమేష్, సాయికుమార్, రోహిణి, అచ్యుత్ కుమార్, హరిప్రియ తదితరులు కీలకపాత్రలో నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 20వ తేదీన ప్రశ్నలకు రానుంది. బచ్చలమల్లి సినిమా గురించి అల్లరి నరేష్ మాటల్లో….
- రెండేళ్ల క్రితం ఈ ప్రయాణం మొదలయ్యింది. నేను చేసిన కేరక్టర్ తో పోలిస్తే కొంచం కొత్తగా అనిపించింది. అప్పటికే కొత్త రకం కథలు చేయాలి అని అనుకున్నాను కాబట్టి ఇంకా ఈ సినిమా కూడా ఓకే చేశాను.
- గమ్యంలో గాలి శ్రీనులా ఈ బచ్చలమల్లి గుర్తుండిపోతుంది. సినిమాలో 3 సంఘటనల మధ్య నడుస్తూ ఉంటుంది.
- నాంది సినిమా వేరు, ఆ సినిమాలో కొట్టించుకుంటాడు. ఇక్కడ వీడే అందరిని కొట్టేస్తాడు.
- నాకు అన్ని తెలుసు అనుకునే ఒక మూర్ఖత్వం అందరిలో ఉంటుంది. కొంత కాలం తరువాత రియలైజ్ అవుతాం. అలాగే ఈ క్యారెక్టర్ కూడా.
- ఒక చిన్న మెసేజ్ తో కూడిన చిత్రం ఈ బచ్చలమల్లి.
- సినిమాలో ఇప్పటి వరకు చూసిన అల్లరి నరేష్ కనిపించకూడదు. కొత్త నరేష్ కనిపించాలి అని డైరెక్టర్ చాల జాగ్రత్త పడ్డారు.
- సినిమా అంతా 1990లలో జరిగే కథ. కాబట్టి ఆ రోజుల్లో పల్లెటూరి వాతావరణంలో ఒక ట్రాక్టర్ డ్రైవర్ కొంచం నీట్ గా లేకుండా ఉండే లుక్ కావాలి అనుకుని ఇలా లుక్ సెలెక్ట్ చేశాం.
- ఈ సినిమా సింపుల్ కథ కాని చాల జాగ్రత్తగా తీసిన కథ. మనం కమర్షియల్ సినిమాలో చూసినట్లు కాకుండా ఫైట్స్ చాల నాచురల్ గా ఉండేలా జాగ్రత్త పడ్డాము.
- హీరో పాజిటివ్, నెగటివ్ అని కాదు. ప్రేక్షకులు ఎమోషన్ కి బాగ కనెక్ట్ అవుతారు. తల్లి బిడ్డల ఎమోషన్, తండ్రి కొడుకుల ఎమోథన్ బాగ అంటే. కొంత మూర్ఖత్వంతో కూడిన వ్యక్తి కాబట్టి కొంచం వేరుగా ఉంటాయి.
- ఆ మూర్ఖత్వంతో పోలీసులు, సిస్టమ్ కి విలువ ఇవ్వదు. కఠినమైన మనిషి. కాని అటువంటి వాడికి ఒక ప్రేమ కథ కూడా ఉంటుంది. ఆ అమ్మాయి కోసం చాల మారతాడు. ఆ మారే ప్రయాణంలో తను గతంలో చేసిన తప్పులు కనిపిస్తూ ఉంటాయి.
- ఈ సినిమా పూర్తిగా ఒక బయోపిక్ కాదు. ఒక నిజమైన మనిషి వ్యక్తిత్వం తీసుకుని తరువాత కొన్ని కథనాలు కలుపుకుని తీసుకున్న సినిమా ఇది.
- ఉగ్రం సినిమాలో చాల స్టిఫ్ గా ఉంటాడు. ఈ సినిమాలో కొంచం లూజ్ గా ఉంటుంది. సినిమాలో ఎక్కువగా తాగుతూ ఉండటం వల్ల కొంచం వేరేలా ఉంటుంది యాక్షన్.
- టెక్నికల్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదు అనుకున్నాం. అందుకే రిచర్డ్, విశాల్ చంద్ర శేఖర్ అనుకున్నాము. వారి గత సినిమాలను కూడా నేను చూసాను. ఈ సినిమా కూడా చాల కష్టపడి బాగ చేశారు.
- సినిమాలో 1995 & 2005 రెండు టైమ్స్ లో జరిగే సినిమా కాబట్టి రెండు లుక్స్ ఉంటాయి. కాబట్టి రెండు బిజిఏంలు ఉంటాయి. ఎమోషన్స్ కూడా బిజిఏం & ఆర్ఆర్ వల్ల బాగ ఎలివేట్ అవుతాయి.
- రియల్ లొకేషన్ లో కొంత మంది నన్ను ఆ లుక్ & కాస్ట్యూమ్ వల్ల నన్ను గుర్తు పట్టలేదు. మమ్మల్ని ఎవరూ అక్కడ ఇబ్బంది పెట్టలేదు.
- నాంది చేసినప్పుడు అటువంటి కేరక్టర్ చేస్తే ప్రేక్షకులు నన్ను చూస్తారా అని ఒక బయం ఉండేది కాని ఆ సినిమా నాకు మంచి నమ్మకం వచ్చేలా చేశాయి. ఉగ్రం సినిమా టైంలో అలాగే అనుకున్నాను. కాని ప్రేక్షకులు ఫైట్స్ కూడా చాల బాగ ఆదరించారు. ఈ సినిమాలు చూశాక అటువంటి సీరియస్ ఫైట్స్ నాకు సెట్ అవుతాయి అని అందరికీ అర్థం అయింది.
- గమ్యం సినిమాలో కూడా కొంచం ఫైట్ చేశాను. కామెడీ సినిమాలు కూడా కచ్చితంగా తీస్తాను.
- ఇప్పటి సినిమాలలో ప్రత్యేకత మారింది. ప్రేక్షకులు అన్ని రకాల సినిమాలు ఓటీటీలో చూసి వేరు వేరు జోనర్ సినిమాలను ఇష్టపడుతున్నారు.
- కామెడీ కోసం స్పూఫ్ చేస్తుంటే ఇప్పటి ప్రేక్షకులు చూడటం లేదు. ఆర్గానిక్ కామెడీ మాత్రమే చూస్తున్నారు.
- ఒక నటుడుగా నాకు సినిమా విజయం సాధిస్తేనే మంచి పేరు వస్తుంది. రంగస్థలం సినిమా చరణ్ గారిలా నాకు ఈ సినిమా పేరు తీసుకొస్తే చాల సంతోషం.
- ఒక డిస్ట్రిబ్యూటర్ నుండి ఒక నిర్మాతగా వచ్చిన మా నిర్మాత అంటే నాకు చాల గౌరవం.
- జీవితంలో కొన్ని కొన్ని సందర్బాలలో అనిపిస్తుంది అలా చేయకుండా ఉండాల్సింది అని. కాని మామూలే ఇటువంటివి అందరి జీవితాలలో.
- రావు రమేష్ సినిమాలో నాకోసం మంచి చెప్తూ ఉంటారు. నేను మారితే బావుండు అనుకునే వ్యక్తి సినిమాలో ఆయన. అలాగే సినిమాలో వైవ హర్ష కూడా చాల మంచి పెరఫార్మర్. సినిమాలో అందరి కేరక్టర్ లు చాల బాగా కుదిరాయి. చాల బాగ చేశారు.
- సినిమాలో రోషన్ & నా తండ్రి కేరక్టర్ కు ఎక్కువ సీన్స్ ఉంటాయి కానీ నాతో ఎక్కువగా ఉంటాయి.
- సినిమాలో ప్రీ క్లైమాక్స్ గురించి సినిమా విడుదల బాగ మాట్లాడుకుంటారు.
- శంభో శివ శంభో సినిమాలో క్యారెక్టర్ మొండివాడు, కాని ఈ సినిమాలో ముర్కుడు. బచ్చలమల్లి సినిమాలో నా క్యారెక్టర్ ను విలన్ గా చూడండి, హీరోగా కాదు.
- అమృత అయ్యర్ ఒక టౌన్ కు వెళ్ళిపోయి బ్రతకాలి అనుకునే ఒక పల్లెటూరు అమ్మాయి. సినిమాలో పద్ధతిగా ఉండే ఒక సైలెంట్ అమ్మాయి. తెలుగింటి అమ్మాయిల ఉండే అమ్మాయి కావాలని అమృత అయ్యర్ ను సెలెక్ట్ చేసుకున్నాము.