నిజంగానే పండగలా ఉంది… థమన్ నువ్వు సూపర్ బాసు

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ప్రతి రోజు పండగే. మారుతీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి చిత్ర యూనిట్ ప్రణాళిక రచిస్తోంది. రిలీజ్ డేట్ కి 50 డేస్ కూడా లేకపోవడంతో చిత్ర యూనిట్ ప్రొమోషన్స్ ని మొదలుపెట్టారు. పోస్టర్స్ తో ఆకట్టుకున్న ప్రతి రోజు పండగే టీం, టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోని రిలీజ్ చేసి ప్రొమోషన్స్ కి మంచి స్టార్ట్ ఇచ్చారు. గత కొంతకాలంగా ఫీల్ గుడ్ మ్యూజిక్ ని సూపర్ గా ఇస్తున్న థమన్, మరోసారి అదే మ్యాజిక్ ని రిపీట్ చేస్తూ టైటిల్ సాంగ్ కి సూపర్ ట్యూన్ ఇచ్చాడు. కేకే రాసిన లిరిక్స్ కి శ్రీకృష్ణ వాయిస్ బలాన్నిచ్చింది. పది మంది ఉండగా ప్రతి రోజు పండగే అనే లిరిక్, ఆ టైంలో వచ్చే మ్యూజిక్ చాలా బాగున్నాయి.

తేజ్ అండ్ సత్యరాజ్ మధ్య లిరికల్ వీడియో చూపించిన సీన్స్, ఆన్ సెట్స్ ఫన్నీ ఇన్సిడెంట్స్ ఆకట్టుకున్నాయి. గత కొంతకాలంగా ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమాలు చేస్తున్న మారుతీ ఈసారి ఏకంగా పెద్ద ఫ్యామిలీతోనే సినిమా చేశాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కంపోజ్ చేసిన ఈ సాంగ్ లిరికల్ వీడియోలో ఈ ఫ్యామిలీ అంతా కనిపించారు. రాశిఖన్నా సెట్స్ లో చాలా ఎనర్జీగా ఉంది, సత్యరాజ్ ప్రతి రోజు పండగే సినిమాకి మెయిన్ ఎస్సెట్ అయ్యేలా ఉన్నాడు. ఇప్పటివరకూ ఇంత కంప్లీట్ ఫ్యామిలీ సినిమా చేయని సాయి ధరమ్ తేజ్, ప్రతి రోజు పండగే సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడు అనేది తెలియాలి అంటే డిసెంబర్ 20 వరకూ ఆగాలి కానీ అప్పటివరకూ ఈ టైటిల్ సాంగ్ వినేయండి.