అక్టోబర్ 23న ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ రెడీ అయ్యింది

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి కోసం ఐదేళ్ళు కేటాయించి చాలా పెద్ద సాహసం చేశాడు. ఆ సాహసానికి తగ్గ రిజల్ట్ అందుకున్న ప్రభాస్, ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తాడు అనుకుంటే మళ్లీ సాహూకి రెండేళ్ల టైం ఇచ్చి ఆ మూవీని కంప్లీట్ చేసాడు. టాక్ తో సంబంధం లేకుండా వసూళ్ల వర్షం కురిపించిన సాహూ సినిమా, ప్రపంచవ్యాప్తంగా 424 కోట్ల గ్రాస్ రాబట్టి రెబల్ స్టార్ సత్తా ఏంటో చూపించాడు. సాహూ విడుదల సమయంలో ఈసారి ఫాస్ట్ గా సినిమాలు చేస్తాను అని చెప్పిన ప్రభాస్ తన బర్త్ డే సందర్భంగా అభిమానులకి స్పెషల్ సర్ప్రైజ్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు.

గోపికృష్ణ మూవీస్ బ్యానర్ లో, జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ‘జాన్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ రెండేళ్ల క్రితం ఒక షెడ్యూల్ జరిగింది. ఈ మూవీ నుంచి అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు కానుకగా అప్డేట్ కానీ అఫీషియల్ పోస్టర్ కానీ బయటకి రానుందని సమాచారం. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మళ్లీ మొదలుకాబోతోంది. మరి గతంలో షూట్ చేసిన కంటెంట్ ని అలానే ఉంచుతారా? లేక మళ్ళీ రీషూట్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.1960లో కాలంలో జరిగే ఒక పీరియాడిక్ లవ్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ లోనే యూరోప్‌ను చూపించేలా పాతిక సెట్స్ వేశారు. ప్రస్తుతం రెస్ట్ మోడ్ లో ఉన్న ప్రభాస్, రెడీ అవగానే జాన్ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. అయితే ఈ సినిమా కూడా పీరియాడికల్ సబ్జక్ట్ కావడంతో జాన్ షూటింగ్ కి ఎంత టైం పడుతుందోనని ప్రభాస్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఈ ప్రశ్నకి సమాధానం రాధాకృష్ణ మాత్రమే చెప్పగలడు కాబట్టి మరి కొన్ని రోజులు ఆగి చూడాలి.