అర్జున్ రెడ్డి ఆదిత్య వర్మ అయ్యాడు, ప్రీతీ మీరా అయ్యింది అంతే

అర్జున్ రెడ్డి, విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమా కల్ట్ క్లాసిక్ గా నిలిచింది. సందీప్ రెడ్డి వంగ, అర్జున్ రెడ్డిని తెరకెక్కించిన విధానం విమర్శకుల ప్రశంశలు దక్కించుకునేలా చేసింది. తెలుగు ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన ఈ సినిమాని హిందీలో కబీర్ సింగ్ గా తెరకెక్కించిన సందీప్ రెడ్డి, బాలీవుడ్ వర్గాలకి భారీ షాక్ ఇస్తూ సూపర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు ఇదే సినిమాని తమిళ్ లో విక్రమ్ కొడుకు ధృవ్ హీరోగా రీమేక్ చేస్తున్నాడు. ఆదిత్య వర్మగా తెరకెక్కిన ఈ సినిమాకి ముందుగా బాలా దర్శకత్వం వహించాడు. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసిన తర్వాత ఫైనల్ ఔట్పుట్ చూసిన విక్రమ్, ఆదిత్య వర్మ సినిమా మొత్తం సందీప్ రెడ్డి శిష్యుడు గిరీశయ్యతో రీషూట్ చేయించాడు. టీజర్ తో మెప్పించిన చిత్ర యూనిట్ ఇప్పుడు ఆదిత్య వర్మ ట్రైలర్ ని రిలీజ్ చేశారు.

ఒరిజినల్ ఫ్లేవర్ ని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సహా చేంజ్ చేయకుండా అలానే ఉంచిన గిరీశయ్య, ఆదిత్య వర్మని అచ్చుగుద్దినట్లు అర్జున్ రెడ్డిలా చేశాడు. ధృవ్ విక్రమ్ కూడా మొదటిసారి హీరో ఎలిమెంట్ ఉన్న వాడిలా కనిపిస్తున్నాడు. అర్జున్ రెడ్డి కాస్త ఆదిత్య వర్మ అయ్యింది, విజయ్ కాస్త ధృవ్ విక్రమ్ అయ్యాడు. ప్రీతీ కాస్త మీరా అయ్యింది. ఇది తప్ప ఆదిత్య వర్మ ట్రైలర్ లో కొత్తగా ఒక్క పాయింట్ కానీ చిన్న చేంజ్ కానీ కనిపించలేదు. డైలాగ్స్ కూడా కలర్ జిరాక్స్ తీసినట్లు జస్ట్ లాంగ్వేజ్ మార్చి అవే పెట్టడం నిజంగా ఆశ్చర్యపరిచే విషయం. అర్జున్ రెడ్డి ఫ్లేవర్ ని కాపాడుకోవడానికే చిత్ర యూనిట్ ఇలా చేశారు అనే విషయం మాత్రం స్పష్టంగా అర్ధమవుతుంది. ఒరిజినల్ వెర్షన్ కి కంప్లీట్ గా న్యాయం చేసిన ఆదిత్య వర్మ నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకి రానుంది.