పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నే మెప్పించిన ఉద్యమ వీరుడి కథ

రాజకీయాల్లో బిజీగా ఉన్న జనసేనాని పవన్ కళ్యాణ్, అప్పుడప్పుడూ ఏదైనా సినిమా నచ్చితే దానిపై స్పందిస్తూ ఉంటాడు. అలాగే పవన్ చేత రీసెంట్ గా కాంప్లిమెంట్స్ అందుకున్న సినిమా జార్జ్ రెడ్డి. ఉస్మానియా విద్యార్థి కెరటం జార్జిరెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన జార్జ్‌రెడ్డి సినిమా ట్రైలర్ బయటకి వచ్చాక ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. రెండేళ్ల క్రితం వచ్చిన అర్జున్ రెడ్డి ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో, ఈ జార్జ్ రెడ్డి కూడా అంతే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఒరిజినల్ కథ కావడం, సినిమా మేకింగ్ లో కాంప్రమైజ్ కాకపోవడంతో ఈ సినిమా బిజినెస్ కూడా బాగానే చేస్తోంది. అయితే ఈ ట్రైలర్ చూసిన పవన్ కళ్యాణ్, డైరెక్టర్‌ జీవన్ కి కాల్ చేసి కాంప్లిమెంట్స్ ఇచ్చాడని తెలుస్తోంది. ఉద్యమవీరుడి నేపథ్యం, నిజజీవిత కథ ఆధారంగా తీస్తున్న జార్జ్ రెడ్డి మంచి విజయం సాధించాలని పవన్ ఆకాక్షించారట.