నో ఫారిన్, జాన్ పనులన్నీ అన్నీ అక్కడే… ప్రభాస్ న్యూ డెసిషన్

బాహుబలి, సాహూ సినిమాలతో పాన్ ఇండియా మార్కెట్ ని సాలిడ్ గా సెట్ చేసుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి రెడీ అయ్యాడు. పూజా హెగ్డేతో ప్రభాస్ కలిసి నటిస్తున్న సినిమా జాన్, ఇప్పటికే యురోప్ లో ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ త్వరలో మొదలుకానుంది. తెలుగు తమిళ హిందీ భాషల్లో తెరకెక్కుతున్న జాన్ సినిమాకి సంబంధించిన సెట్ వర్క్ శరవేగంగా జరుగుతోంది.

prabhas jaan

సాహూ షూట్ చేసిన అన్నపూర్ణ స్టూడియోలోనే స్పెషల్ గా ట్రైన్ సెట్ ను క్రియేట్ చేసారు. పీరియాడికల్ లవ్ స్టోరీగా రూపొందనున్న జాన్ కోసం ఆ పీరియాడిక్ అప్పీరెన్స్ వచ్చేలా ఆర్ట్ డైరక్టర్ రవీందర్ సెట్ డిజైన్ చేశాడట. దాదాపు రెండు కోట్ల ఖర్చుతో రెండు రైలు పెట్టెల సెట్ ని చాలా అద్భుతంగ ఎరెక్ట్ చేశారని, సినిమాలో ఈ ట్రైన్ నేపథ్యంలో వచ్చే సూపర్బ్ గా ఉంటాయని సమాచారం.11 రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్ కంప్లీట్ అవగానే, రామోజీ ఫిలిం సిటీలో వేసిన సెట్ లో షూట్ చేస్తారట. ఫారిన్ ట్రిప్ వేయకుండా షూటింగ్ అంతా సెట్స్ వేసి కంప్లీట్ చేయాలని ప్రభాస్ భావిస్తున్నాడట.