ఆ లేటెస్ట్ సెన్సేషన్ సినిమా ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్?

సందీప్ మాధవ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ జార్జ్ రెడ్డి.. 1965 నుంచి 1975 కాలంలో హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్శిటీలో చదువుతూ.. స్టూడెంట్ లీడర్ గా ఎదిగిన జార్జ్ రెడ్డి కథతో తెరకెక్కిన ఈ సినిమా ఒక్క ట్రైలర్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. దళం ఫేమ్ జీవన్, రియలిస్టిక్ గా తెరకెక్కించిన జార్జ్ రెడ్డి… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంప్లిమెంట్స్ కూడా అందుకుంది. నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ త్వరలో జరగనుంది. గ్రాండ్ గా జరగనున్న ఈ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్టుగా వచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.

ఒకవేళ ఈ ఈవెంట్ పవర్ స్టార్ నిజంగానే వస్తే సైద్ధాంతిక భావజాలం ఉన్న పవన్ కళ్యాణ్, నోటి వెంట జార్జ్ రెడ్డి గురించి వచ్చే స్పీచ్ తప్పకుండ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. పైగా పవన్ కళ్యాణ్ రాక జార్జ్ రెడ్డి సినిమా ఓపెనింగ్స్ భారీగా హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. జార్జ్ రెడ్డిపై పాజిటివ్ వైబ్ ఉంది కాబట్టి దానికి పవన్ ఫ్యాన్స్ సపోర్ట్ కూడా ఉంటే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మరో సంచలనం అయ్యే అవకాశం ఉంది. మరి జార్జ్ రెడ్డి ప్రీరిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ వస్తాడా లేదా అనేది చూడాలి.