వైరల్‌గా మారిన ‘సలార్’ ఫ్యాన్‌మేడ్ పోస్టర్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో మూడు పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం. ప్రస్తుతం కె.రాధాకృష్ణకుమార్ డైరెక్షన్‌లో రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్ నటిస్తున్నాడు. ఇందులో పూజాహెగ్దే హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో పాటు కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో రానున్న సలార్ సినిమాలో ప్రభాస్ నటించనున్నాడు.

prabahs salar fan made

ఇటీవలే సలార్ సినిమా ప్రారంభమవ్వగా.. వచ్చే నెల నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించనున్న ఆదిపురుష్ సినిమా కూడా త్వరలో ప్రారంభం కానుంది. అలాగే టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ప్రభాస్ చేయనున్న సినిమా కూడా త్వరలో ప్రారంభమయ్యే అవకాశముంది.

ఇది ఇలా ఉంటే సలార్ సినిమాకు సంబంధించిన పోస్టర్ ఇటీవల విడుదలై సోషల్ మీడియాలో ట్రెండింగ్ సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా సలార్ ఫ్యాన్ మేడ్ పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ప్రభాస్ నడుము వెనుక తుపాకీ ఉంది. మీసాలతో మాస్ లుక్‌లో ప్రభాస్ ఉన్నాడు.