Powerstar: వకీల్‌సాబ్ ఓటీటీకి.. ప‌వ‌న్ ఫ్యాన్స్ షాక్!

Powerstar: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌టించిన తాజా చిత్రం వ‌కీల్‌సాబ్‌. ఈ చిత్రానికి శ్రీ‌రామ్ వేణు ద‌ర్శ‌క‌త్వంలో.. దిల్‌రాజు, బోనీక‌పూర్ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్న విజ‌యం తెలిసిందే. బాలీవుడ్‌లో ఘ‌న విజ‌యం సాధించిన పింక్ రీమేక్‌గా వ‌స్తుంది ఈ చిత్రం. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించి పోస్ట‌ర్ల్‌, టీజ‌ర్ ఫ్యాన్స్‌నే కాకుండా ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమా కోసం ఎంతో ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు. Powerstarఈ చిత్రాన్ని ఉగాది కానుక‌గా ఏప్రిల్ 9న ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. కాగా ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన అప్‌డేట్ వ‌చ్చింది..

PowerstarPavankalyan

ఈ సినిమా థియేట్రిక‌ల్ రిలీజ్‌తో పాటు ఓటీటీలో రిలీజ్ చేయ‌డానికి స‌న్నద్ధం అవుతున్నారు. ఓటీటీ దిగ్గ‌జం అమెజాన్ ప్రైమ్ వీడియో డిజిట‌ల్ హ‌క్కుల‌ను ద‌క్కించుకోగా.. జీ సినిమాస్ శాటిలైట్ రైట్స్‌ను ద‌క్కించుకుంది. ఈ సినిమా 50రోజుల త‌ర్వాత ఓటీటీలో ప్ర‌సారం కానుందట‌. అంటే మే 29న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంద‌ని స‌మాచారం. కానీ ఈ విష‌యంపై ప‌వ‌న్ ఫ్యాన్స్ షాక్‌కు గుర‌వుతున్నారు. Powerstarఈ సినిమా థియేట‌ర్లో రిలీజ్ కాదా అని అభిమానుల్లో ఎన్నో అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. త‌మ అభిమాన‌ హీరో రీఎంట్రీ ఇస్తున్న చిత్రాన్ని థియేట‌ర్లోనే చూడాలని.. మొద‌టి నుంచి ఫ్యాన్స్ ఎంతో ఆతృత‌గా చూస్తున్న క్ష‌ణాలు త్వ‌ర‌లోనే వ‌స్తున్న స‌మ‌యంలో ఓటీటీలో రిలీజ్ అని ఫ్యాన్స్‌ల్లో కంగారు నెల‌కొన్న ప‌రిస్థితులు ఏర్ప‌డుతున్నాయి. ఇక ఈ చిత్రంలో ప‌వ‌న్ స‌ర‌స‌న మ‌రోసారి శ్రుతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టించింది.. అలాగే అంజ‌లి, నివేధాథామ‌స్‌, అన‌న్య నాగేళ్ల ఈ సినిమాలో కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ స్వ‌రాలు అందిస్తున్నారు. ఇప్ప‌టికే ఈPowerstar సినిమా నుంచి నేప‌థ్య‌సంగీతం ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఆక‌ట్టుకుంది.