Powerstar: ప‌వ‌న్ సినిమా కోసం చార్మినార్ సెట్‌..

Powerstar: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాన్, క్రిష్ జాగ‌ర్ల‌మూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత ఏ.ఎమ్. ర‌త్నం నిర్మిస్తుండ‌గా.. ఇందులో ప‌వ‌న్ స‌ర‌స‌న తొలిసారి నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రం పీరియాడికల్ డ్రామా క‌థాంశంతో రూపుదిద్దుతుండ‌గా.. Powerstar ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌27 వ‌ర్కింగ్ టైటిల్‌తో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకొంటున్న ఈ చిత్రం నుంచి ఓ ఆస‌క్తిక‌ర విష‌యం ఫిలింన‌గ‌ర్‌లో చ‌క్క‌ర్లు కొడుతుంది.

ఈ సినిమా 15వ శ‌తాబ్ద‌పు మొఘ‌ల్ సామ్రాజ్య‌పు కాలం నాటి ప‌రిస్థితుల ఆధారంగా తెర‌కెక్కుతుండ‌గా.. ఆ కాలం నాటి పరిస్థితుల‌ను చూపించేందుకు.. ఇందులో భాగంగానే చార్మినార్ వైభ‌వం గురించి చెప్ప‌నున్నార‌ట‌. అందుకే Powerstar ఈ సినిమా కోసం చార్మినార్ సెట్‌ను రూపొందిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇక మ‌రోవైపు ఈ చిత్రానికి టైటిల్ వీర‌మ‌ల్లు అని ప‌రిశీలిస్తున్నార‌ట చిత్ర‌బృందం. దాదాపుగా ఇదే ఖ‌రారవుతుంద‌ని టాక్‌. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టులు అర్జున్ రాంపాల్‌, జాన్ అబ్ర‌హాం తో పాటు బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ త‌దిత‌రులు నటిస్తుండ‌గా.. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణీ ఈ చిత్రానికి సంగీతం స‌మ‌కురుస్తున్నారు.